LPG Subsidy: ఉచిత ఎల్పీజీ కనెక్షన్ నిబంధనలలో కొత్త మార్పులు..!

New Changes in Free LPG Connection Rules
x

LPG Subsidy: ఉచిత ఎల్పీజీ కనెక్షన్ నిబంధనలలో కొత్త మార్పులు..!

Highlights

LPG Subsidy: ఎల్పీజీపై సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

LPG Subsidy: ఎల్పీజీపై సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఉజ్వల పథకం కింద ఉచిత LPG గ్యాస్ కనెక్షన్‌పై లభించే సబ్సిడీలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం పథకం కింద కొత్త కనెక్షన్ల కోసం సబ్సిడీ నిర్మాణంలో మార్పు ఉండవచ్చు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రెండు కొత్త నిర్మాణాలకు సంబంధించిన పనులను ప్రారంభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కోటి కొత్త కనెక్షన్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం OMCల తరపున ముందస్తు చెల్లింపు పద్దతిని మార్చేఅవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు చెల్లింపు విధానం మారుతుందా?

ప్రస్తుతం OMCలు ఈఎంఐ రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని వసూలు చేస్తాయి. అయితే ఈ విషయం తెలిసిన నిపుణుల ప్రకారం.. ఈ పథకంలో ప్రభుత్వం మిగిలిన 1600 సబ్సిడీని కొనసాగిస్తుంది. ప్రభుత్వ ఉజ్వల పథకం కింద వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్‌, స్టవ్‌ అందజేస్తారు. దీని ఖరీదు దాదాపు రూ. 3200. ప్రభుత్వం నుంచి రూ. 1600 సబ్సిడీ అందుతుంది. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) అడ్వాన్స్‌గా రూ. 1600 ఇస్తాయి. అయితే రీఫిల్‌లపై సబ్సిడీ మొత్తాన్ని EMIగా వసూలు చేస్తాయి.

ఉజ్వల పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి..?

1. ఉజ్వల పథకం కోసం నమోదు చేసుకోవడం చాలా సులభం.

2. ఉజ్వల పథకం కింద BPL కుటుంబానికి చెందిన ఒక మహిళ గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3.pmujjwalayojana.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

4. ముందుగా ఒక ఫారమ్‌ను పూరించి సమీపంలోని LPG డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వాలి.

5. ఈ ఫారమ్‌లో దరఖాస్తు చేసుకున్న మహిళ తన పూర్తి చిరునామా, జన్ ధన్ బ్యాంక్ ఖాతా, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్‌ను ఇవ్వాలి.

6. దానిని ప్రాసెస్ చేసిన తర్వాత దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అర్హులైన లబ్ధిదారునికి LPG కనెక్షన్‌ను జారీ చేస్తాయి.

7. వినియోగదారు EMIని ఎంచుకుంటే సిలిండర్‌పై పొందే సబ్సిడీకి అనుగుణంగా సర్దుబాటు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories