Personal Loan: ఈ పనుల కోసం ఎప్పుడు పర్సనల్‌ లోన్‌ తీసుకోవద్దు.. చాలా నష్టపోతారు..!

Never Take a Personal Loan for These Works you Will Lose a lot
x

Personal Loan: ఈ పనుల కోసం ఎప్పుడు పర్సనల్‌ లోన్‌ తీసుకోవద్దు.. చాలా నష్టపోతారు..!

Highlights

Personal Loan: చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు (పర్సనల్‌ లోన్‌) తీసుకుంటారు.

Personal Loan: చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు (పర్సనల్‌ లోన్‌) తీసుకుంటారు. గత కొన్నేళ్లుగా బ్యాంకులు వ్యక్తిగత రుణాల ప్రక్రియని సులభతరం చేశాయి. అందుకే చాలామంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. కానీ వ్యక్తిగత రుణాన్ని అన్‌సెక్యూర్డ్ లోన్ అంటారు. ప్రజలు కొన్ని పనుల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.

వ్యక్తిగత రుణం ఖరీదు

గృహ రుణం, కారు రుణం వంటి ఇతర రకాల రుణాల కంటే బ్యాంక్ వ్యక్తిగత రుణం చాలా ఖరీదైనది. ఇందులో రుణాల కంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది నిపుణులు పర్సనల్ లోన్ తీసుకోకుండా ఉండమని సలహా ఇస్తారు. ఈరకం లోన్ తీసుకోవడానికి సదరు వ్యక్తి బంగారం, కారు లేదా ఇల్లు వంటి వాటిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తి CIBIL స్కోర్ బాగుంటే అతడికి బ్యాంకులు సులువుగా రుణాలు మంజూరుచేస్తాయి. అందుకే చాలామంది వ్యక్తిగత రుణాలని తీసుకుంటారు. ఎందుకంటే బ్యాంకులు వీటిని సులభంగా అందుబాటులో ఉంచుతాయి.

ప్రాపర్టీ కొనడానికి పర్సనల్ లోన్ వద్దు

కొంతమంది ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు దాని డౌన్ పేమెంట్ కోసం బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇది తప్పు అంటున్నారు నిపుణులు. పర్సనల్ లోన్ కింద ప్రాపర్టీని కొనుగోలు చేస్తే నష్టమే తప్ప లాభం ఏమి ఉండదని చెబుతున్నారు. వడ్డీలు కూడా అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేయడానికి వ్యక్తిగత రుణ సహాయం తీసుకోకుండా ఉంటే మంచిది.

అదే సమయంలో చాలా మంది క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకుంటారు. ఇందులో బ్యాంకుల వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ వాయిదాలు కూడా పెరుగుతాయి. మీరు ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించడం మిస్ అయితే మీ CIBIL స్కోర్ దెబ్బతింటుంది. దీని కారణంగా భవిష్యత్తులో ఏదైనా లోన్ తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇది కాకుండా ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనడానికి లేదా ఖరీదైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లేందుకు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు. అంతేకాదు ఇటువంటి లోన్‌ తీసుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. ఒక వ్యక్తి ఇల్లు లేదా కారు రుణం తీసుకుంటే భవిష్యత్తులో దానిని విక్రయించి బ్యాంకుకు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. కానీ పర్సనల్ లోన్ల విషయంలో ఇలాంటివేమీ ఉండవు. ఈ సందర్భంలో మరో రుణం తీసుకోవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని చాలా దారుణంగా మారుస్తుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories