Business Idea: ఇల్లు కదలకుండానే రూ. లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌..!

Mushroom Making Business in Telugu Know About Full Details
x

Business Idea: ఇల్లు కదలకుండానే రూ. లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌..!

Highlights

Business Idea: వ్యాపారం అనగానే రూ. లక్షల్లో పెట్టుబడి, ఎంతో కష్టతో కూడుకున్న అంశంగా భావిస్తుంటారు.

Business Idea: వ్యాపారం అనగానే రూ. లక్షల్లో పెట్టుబడి, ఎంతో కష్టతో కూడుకున్న అంశంగా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆదాయం ఎక్కువ వచ్చే వ్యాపారాలకు ఈ రిస్క్‌ మరీ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అందుకే చాలా మంది వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నా, ఇలాంటి వాటికి భయపడి విరమించుకుంటారు. అయితే ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు ఆర్జించే వ్యాపారాలు కూడా ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా ఆలోచన, కష్టపడి పనిచేసే లక్షణం అంతే.

ఇలాంటి బెస్ట్ బిజినెస్‌ ఐడియాల్లో పుట్టగొడుగుల పెంపకం ఒకటి. ఇటీవల పుట్టగొడుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. చాలా మంది ఔత్సాహిక యువత పుట్టగొడుగల వ్యాపారాన్ని ప్రారంభించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. అందులోనూ తక్కువ పెట్టుబడితోనే, ఇంట్లో ఓ గదిలోనే వీటి తయారీ ఉండడం కారణంగా చాలా మంది ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ పుట్టగొడుగుల వ్యాపారం ఎలా ప్రారంభించాలి.? ఇందుకు అవసరమయ్యే పెట్టుబడి ఎంత.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టగొడుగుల వ్యాపారాన్ని కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. చదరపు మీటరుకు 10 కిలోల పుట్టగొడుగులను సాగు చేయవచ్చు. కనీసం 40×30 అడుగుల స్థలంలో మూడు అడుగుల వెడల్పు గల మూడు రాక్‌లను ఏర్పాటు చేసి..కవర్లలో పుట్టగొడులను పెంచాల్సి ఉంటుంది. ఇక పుట్టగొడుల పెంపకానికి కంపోస్ట్‌ కూడా అవసరపడుతుంది. కంపోస్ట్‌ను కూడా సహజ పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు పుట్టగొడుగుల తయారీకి సంబంధించి శిక్షణ అందిస్తున్నాయి.

ఇక యూట్యూబ్‌లోనూ పుట్టగొడుగల తయారీకి సంబంధించిన ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ కేంద్రాలను సంప్రదించడం ద్వారా కూడా పుట్ట గొడుగులకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. రూ. 50 వేల ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభింవచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 10 వేల నుంచి దీర్ఘకాలంలో రూ. 50 వేల వరకు ఆర్జించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories