Muhurat Trading: దీపావళి సందర్భంగా నేడు మూరత్ ట్రేడింగ్

Muhurat Trading Today on the Occasion of Diwali
x

Muhurat Trading: దీపావళి సందర్భంగా నేడు మూరత్ ట్రేడింగ్

Highlights

Muhurat Trading: సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు మూరత్ ట్రేడింగ్

Muhurat Trading: ట్రెడిషనల్ గా పేరతి ఏడాది దీపావళి రోజున జరిగే మూరత్ ట్రేడింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ కానుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు అంటే గంట సేపు మూరత్ ట్రేడింగ్ జరగనుంది. BSE, NSEల ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ఆరు గంటల నుంచి 6 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. గత 15 మూరత్ ట్రేడింగ్స్ లో 11సార్లు మార్కెట్లు పాజిటివ్ గా క్లోజయ్యాయి. దీనికి తోడు శుక్రవారం నిఫ్టీ సుమారు 2శాతం లాభాలతో ముగిసింది. దీని బట్టి ఈ రోజు మూరత్ ట్రేడింగ్ లో మార్కెట్ పాజిటివ్ గా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హిందూక్యాలండర్ ప్రకారం ప్రతీ ఏడాది దీపావళి నాడు కొత్త సంవత్సరం మొదలవుతుంది. 2079వ సంవత్ లోకి ఎంటర్ అవుతున్నవేళ ఏడాది అంతా మంచే జరగాలని మూరత్ ట్రేడింగ్ ట్రెడిషన్ ను ఎక్స్ఛేంజీలు కొనసాగిస్తున్నాయి. ఈ సంప్రదాయాన్ని బీఎస్ఈలో 1957లో ప్రారంభించారు. NSEలో 1992 నుంచి కొనసాగిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం సాధారణంగా సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో ఈ పూజలు జరుగుతుంటాయి. దీంతో ఇదే టైమ్ లో మార్కెట్ లో కూడా మూరత్ ట్రేడింగ్ జరుగుతోంది. సంవత్ 2079 మంచిగా కనిపిస్తోందని, దేశ ఎకానమీ మంచి పాజిషన్ లో ఉందని మార్కెట్ ఎనలిస్టులు అంటున్నారు.

గ్లోబల్ గా వోలటాలిటీ కనిపిస్తున్నా మన దేశ ఎకానమీ స్టేబుల్ గా ఉందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2023లో కూడా ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు మంచి పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి రోజు ట్రేడింగ్‌ చేయడాన్ని ఇన్వెస్టర్లు శుభంగా భావిస్తారు. ఆ రోజు స్టాక్‌లు కొనుగోలు చేస్తే, వచ్చే దీపావళి వరకు లాభాలు అందుతాయని నమ్ముతారు.

గత దీపావళి నుంచి భారతీయ మార్కెట్ ఇతర ప్రపంచ, అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్‌లను అధిగమించింది. అస్థిర స్థూల ఆర్థిక పరిణామాలు, వేగవంతమైన పాలన మార్పులు, వోలటైల్‌గా ఉన్న ఫారెన్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఎదుర్కొని భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది. గత దీపావళి నుంచి 2022 అక్టోబర్ 11 వరకు బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 5 శాతం మాత్రమే క్షీణించింది. కొత్త సంవత్ 2079 చాలా ప్రకాశవంతంగా, ఆశాజనకంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories