వినియోగదారులకు గ్యాస్‌ కంపెనీల షాక్ : ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు

వినియోగదారులకు గ్యాస్‌ కంపెనీల షాక్ : ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు
x
Highlights

వినియోగదారులకు గ్యాస్‌ కంపెనీలు షాక్‌ నిచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలు పెంచాయి....

వినియోగదారులకు గ్యాస్‌ కంపెనీలు షాక్‌ నిచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలు పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలు కానున్నట్టు స్పష్టం చేశాయి. ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కు పెరిగింది.

దేశంలో చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories