LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
x
Highlights

LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి.

LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. 19 కిలోల సిలిండర్‌ ధర గరిష్ఠంగా రూ.32 వరకు తగ్గింది. దిల్లీలో ప్రస్తుత ధర రూ.1,646కు దిగొచ్చింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.

కాగా, వరుసగా గత రెండు నెలల నుంచి కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జూన్‌1న ఎల్‌పీజీ రేటు దాదాపు రూ.69 తగ్గగా, మే 1న సిలిండర్‌పై రూ.19 తగ్గింది. ఇక 14.2 కిలోల గృహ వినియోగ వంటగ్యాస్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండన్‌ కొత్త ధరలు..

హైదరాబాద్‌ - రూ.1,872

విజయవాడ - రూ.1,832

విశాఖపట్నం - రూ.1,704

ముంబయి - రూ.1,598

కోల్‌కతా - 1,756

చెన్నై - రూ.1,809

బెంగళూరు - రూ.1,724

తిరువనంతపురం - రూ.1,676

Show Full Article
Print Article
Next Story
More Stories