Business Idea: ఉన్న ఊరిలోనే మంచి వ్యాపారం.. పక్కాగా భారీ ఆదాయం..!

Low Investment and get High Profits With Tea Franchise Business
x

Business Idea: ఉన్న ఊరిలోనే మంచి వ్యాపారం.. పక్కాగా భారీ ఆదాయం..!

Highlights

Business Idea: ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. ఉద్యోగం కోసం ఎక్కడికో పట్టణాలకు వెళ్లే కంటే ఉన్న ఊరిలోనే మంచి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు.

Business Idea: ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. ఉద్యోగం కోసం ఎక్కడికో పట్టణాలకు వెళ్లే కంటే ఉన్న ఊరిలోనే మంచి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. వినూత్న మార్గాలను ఎంచుకుంటూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. పెద్ద చదువులు చదివిన వారు కూడా కొత్తగా ఆలోచిస్తూ సొంతూరిలో వ్యాపారాలు చేస్తున్నారు. ఉన్న ఊరిలోనే చేసుకునే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రాంతంతో సంబంధం లేకుండా టీ ఫ్రాంచైజీలకు మంచి డిమాండ్‌ పెరుగుతోంది. ప్రజలు కూడా మాములు టీ కొట్టులో కంటే ఒక ప్రత్యేక ఫ్రాంచైజీలో టీ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో రకరకాల ఫ్రాంచైజీలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి టీ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

కేవలం టీకి మాత్రమే పరిమితం కాకుండా స్నాక్స్‌ వంటి వాటిని కూడా ఇందులో విక్రయించుకునే వెసులుబాటు లభిస్తోంది. ప్రజలు ఎక్కువగా ఉండే హాస్పిటల్స్‌, హోటల్స్‌, కాలేజీలకు సమీపంలో ఇలాంటి టీ పాయింట్స్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. ఆయా సంస్థల బట్టి టీ ఫ్రాంచైజీని ప్రారంభించేందుకు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు అవసరపడుతుంది.

టీ తయారీకి కావాల్సిన ముడి సరుకుతో పాటు, బ్రాండింగ్ అంతా ఫ్రాంచైజీ యజమానులు చూసుకుటారు కాబట్టి ఎలాంటి టెన్షన్‌ ఉండదు. ఇక మీరు స్థానికంగా బాగా ప్రమోట్‌ చేసుకుంటే సరిపోతుంది. కేవలం టీకి మాత్రమే పరిమితం కాకుండా కూల్‌డ్రింక్స్‌, చాట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా ఐపీఎల్‌, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న సమయాల్లో ఒక స్క్రీన్‌ ఏర్పాటు చేస్తే యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతుంటారు. ఈ వ్యాపారంలో తక్కువలో తక్కువ కనీసం నెలకు రూ. 50 వేల వరకు ఆర్జించవచ్చు. ఇందుకు సంబంధించి ఎన్నో ఫ్రాంచైజీలు అందుబాటులోకి ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకొని, మీకు స్థానికంగా ఉన్న మార్కెట్‌ను అంచనా వేసుకొని బిజినెస్‌ ప్రారంభిస్తే లాభాలే లాభాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories