చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!

Linking of PAN Card With Aadhaar is Mandatory by 31 March 2023
x

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!

Highlights

Pan Aadhar Link: మీరు ఇంకా పాన్‌కార్డుని ఆధార్‌తో లింక్ చేయకుంటే వీలైనంత త్వరగా పూర్తి చేయండి.

Pan Aadhar Link: మీరు ఇంకా పాన్‌కార్డుని ఆధార్‌తో లింక్ చేయకుంటే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లేదంటే పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ఆదాయపు పన్ను హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఆధార్‌తో లింక్ చేయని పాన్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని తెలిపింది.

మినహాయింపు ఎవరికి..

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్లందరిని అలర్ట్‌ చేసింది. 31 మార్చి 2023లోపు వారు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని తెలిపింది. లేదంటే ఏప్రిల్ 1, 2023 నుంచి పాన్‌కార్డు నిష్క్రియంగా మారుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2017 మేలో నోటిఫికేషన్ జారీ చేసింది. మినహాయింపు పొందిన కేటగిరీలో అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయలో నివసించే వారు ఉన్నారు.

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం నాన్-రెసిడెంట్‌లుగా పరిగణించబడే వ్యక్తులు కూడా ఈ వర్గంలోకి వస్తారు. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, భారత పౌరులు కాని వారు ఈ లిస్టులో ఉంటారు. మార్చి 30న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అంటే CBDT ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఒకసారి పాన్ పనిచేయకపోతే IT చట్టం ప్రకారం ఆ వ్యక్తి అన్ని పరిణామాలను భరించవలసి ఉంటుంది. చాలా ఇబ్బందులని ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకసారి పాన్‌కార్డు పని చేయకపోతే సదరు వ్యక్తి IT రిటర్న్‌లను ఫైల్ చేయలేరు. ఇది కాకుండా బాకీ ఉన్న రాబడుల ప్రాసెసింగ్ ఉండదు. బాకీ ఉన్న రిటర్న్‌లు జారీ చేయబడవు. రిటర్న్‌లో లోపం ఉంటే పెండింగ్ ప్రక్రియ పూర్తి కాదు. దీంతో ఎక్కువ రేటుతో పన్ను మినహాయింపు ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు పాన్ ముఖ్యమైన KYC పత్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories