లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సేవింగ్‌ స్కీమ్‌ ఈ రెండింటిలో ఏది బెటర్..!

Life Insurance and Saving Scheme Which one is Better
x

లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సేవింగ్‌ స్కీమ్‌ ఈ రెండింటిలో ఏది బెటర్..!

Highlights

Life Insurance vs Savings Scheme: చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు ఆందోళన చెందుతారు.

Life Insurance vs Savings Scheme: చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు ఆందోళన చెందుతారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సేవింగ్‌ స్కీమ్‌ ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక అయోమయానికి గురవుతారు. ఇన్సూరెన్స్‌ కింద ఏదైన వ్యక్తికి అనుకోకుండా ఘటన జరిగితే కొంత మొత్తం డబ్బు అందుతుంది. కుటుంబంలో సంపాదించే సభ్యుడు మరణించిన సందర్భంలో మిగిలిన సభ్యులకు సహాయం చేస్తారు. నామినీకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ జీవిత బీమా పాలసీ పొదుపుకు మంచిది కాదని కొందరు అంటారు.

జీవిత బీమా కింద వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి పూర్తి రక్షణ అందిస్తామని హామీ ఇస్తారు. అయితే పొదుపు పథకాలలో మాత్రం ఆదా చేసిన మొత్తం వడ్డీతో చెల్లిస్తారు. జీవిత బీమా పాలసీలో ఒక వ్యక్తి బీమాను మాత్రమే పొందుతాడు. కానీ ఒక వ్యక్తి పొదుపు పథకంలో భారీ మొత్తాన్ని పొందుతాడు. కుటుంబ సభ్యులు ఈ డబ్బులని వివిధ మార్కెట్ మాధ్యమాలలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

జీవిత బీమాలో ఒక వ్యక్తి చౌకగా ప్రీమియం చెల్లించాలి. అదే సమయంలో పొదుపు పథకం ప్రీమియం కొంత ఖరీదైనది. టర్మ్‌ పాలసీలో మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు. అయితే పొదుపు పథకంలో పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందుతాడు. అయితే జీవిత బీమా పథకాలు,పొదుపు పథకాలు రెండూ డబ్బును పెట్టుబడి పెట్టడానికి మంచి ఎంపికలు. మీకు సమీప భవిష్యత్తులో ఆర్థిక అవసరం ఉన్నప్పుడు, లేదా మీరు లేనప్పుడు కుటుంబాన్ని కవర్ చేసే ప్రత్యక్ష బీమా ప్లాన్ అవసరమైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇలాంటి పాలసీలని కొనుగోలు చేసేటప్పుడు కవర్ మాత్రమే కాదు పొదుపు కూడా ఉండే ఎంపికలని ఎంచుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories