LIC: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. 4 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే కోటి రూపాయలు మీవే..!

LIC Shiromani Policy Getting the Benefit of Rupees 1 Crore Know Here how
x

LIC: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. 4 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే కోటి రూపాయలు మీవే..! 

Highlights

LIC: ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. తన పాలసీలతో చాలామందికి ఆర్థిక భద్రతని కల్పిస్తోంది.

LIC: ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. తన పాలసీలతో చాలామందికి ఆర్థిక భద్రతని కల్పిస్తోంది. ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు కాబట్టి సామాన్యుల నుంచి మిలియనీర్ల వరకు అందరు ఇన్సూరెన్స్‌ పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా వారి ఆదాయం ప్రకారం పాలసీలను అందించడం ఎల్‌ఐసీ ప్రత్యేకత. అందుకే దేశంలో దీనికి ఫాలోయింగ్‌ ఉంది. అయితే మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టి బాగా సంపాదించాలంటే అలాగే రిస్క్‌ ఉండకూడదనుకుంటే ఎల్‌ఐసీ అందించే ఈ సూపర్ పాలసీ మీకు సరిపోతుంది. ఇందులో 4 ఏళ్లు ప్రీమియం చెల్లించి కోటి రూపాయల బెనిఫిట్స్‌ పొందే అవకాశాలు ఉన్నాయి. అది ఎలాగో తెలుసుకుందాం.

LIC జీవన్ శిరోమణి ప్లాన్

నిజానికి ఇది నాన్-లింక్డ్ ప్లాన్. ఇందులో మీరు కనీసంకోటి రూపాయల హామీని అందుకుంటారు. ఈ ప్లాన్‌ను LIC డిసెంబర్ 19, 2017న ప్రారంభించింది. ఇది మనీ బ్యాక్ ప్లాన్. ఇది మార్కెట్‌తో ముడిపడి ఉన్న ప్రయోజన ప్రణాళిక. ఈ ప్లాన్ ప్రత్యేకంగా అధిక-నికర-విలువ గల వ్యక్తుల కోసం (హై నెట్ వర్త్ వ్యక్తులు) రూపొందించారు. విపత్కర అనారోగ్యం సంభవించినప్పుడు కూడా ఈ ప్లాన్ మీకు వర్తిస్తుంది. ఇందులో ఆప్షనల్ రైడర్లు కూడా ఇచ్చారు.

సర్వైవల్ బెనిఫిట్‌..

సర్వైవల్ బెనిఫిట్ అనేది పాలసీదారుల మనుగడపై ఆధారపడిన స్థిర పరిహారం.

1.14 సంవత్సరాల పాలసీ -10వ,12వ సంవత్సరం 30-30% హామీ మొత్తం

2. 16 సంవత్సరాల పాలసీ -12వ, 14వ సంవత్సరం 35-35% హామీ మొత్తం

3. 18 సంవత్సరాల పాలసీ -14వ, 16వ సంవత్సరం 40 హామీ మొత్తం- 40 %

4. 20 సంవత్సరాల పాలసీ -16వ, 18వ సంవత్సరం 45-45% హామీ మొత్తం.

ఎంత రుణం లభిస్తుంది..

ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే కస్టమర్ పాలసీ వ్యవధిలో పాలసీ సరెండర్ విలువపై రుణం తీసుకోవచ్చు. అయితే ఈ రుణం LIC నిబంధనలు-షరతుల ప్రకారం మాత్రమే అందిస్తారు. పాలసీ లోన్ క్రమ పద్ధతిలో నిర్ణయించే వడ్డీ రేటుతో ఇస్తారు.

షరతులు ఏంటి..

1. కనీస హామీ మొత్తం – రూ. 1 కోటి

2. గరిష్ట హామీ మొత్తం: పరిమితి లేదు

3. పాలసీ వ్యవధి: 14, 16, 18 , 20 సంవత్సరాలు

4. ఏ సమయానికి ప్రీమియం చెల్లించాలి: 4 సంవత్సరాలు

5. కనీస వయస్సు 18 సంవత్సరాలు..

6. గరిష్ట వయస్సు: 14 సంవత్సరాల పాలసీలకు 55 సంవత్సరాలు; 16 సంవత్సరాల పాలసీకి 51 సంవత్సరాలు; 18 సంవత్సరాల పాలసీకి 48 సంవత్సరాలు; 20 ఏళ్ల పాలసీకి 45 ఏళ్లుగా నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories