LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు గమనిక.. ఈ రెండు పాలసీలలో మార్పులు..

LIC revises annuity rates of Jeevan Akshay and New Jeevan Shanti  policies
x

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు గమనిక.. ఈ రెండు పాలసీలలో మార్పులు..

Highlights

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు గమనిక.. ఈ రెండు పాలసీలలో మార్పులు..

LIC: దేశంలోనే ఇన్సూరెన్స్‌ రంగంలో అతిపెద్దదైన ఎల్‌ఐసీ ఎంతో మందికి చేయూతనిస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రకరకాల పాలసీలను అందిస్తుంది. ఆర్థికంగా భరోసాని కల్పిస్తోంది. ఎల్‌ఐసీ పాలసీల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రక్షణతో పాటు రాబడి కూడా ఉంటుంది. అయితే అవి మీరు ఎంచుకునే పాలసీలను బట్టి ఉంటాయి. తాజాగా ఎల్‌ఐసీ రెండు పాలసీలలో మార్పులు చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్, న్యూ జీవన్ శాంతి పాలసీలకు సంబంధించి యాన్యుటీ రేట్లను సవరించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి1 నుంచి మారిన కొత్త రేట్లతో పాలసీలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అందువల్ల ఈ రెండు పాలసీలు తీసుకునే ముందు కొత్త యాన్యుటీ రేట్లు చెక్‌ చేసుకోవడం ఉత్తమం. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోని క్యాలిక్యులేటర్ సాయంతో మీరు యాన్యుటీ రేట్లను లెక్కించుకోవచ్చు. అంతేకాకుండా యాన్యుటీ రేట్ల సవరణతోపాటు ఈ రెండు పాలసీలు కొత్త డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఇకపోతే ఎల్‌ఐసీ ఈ త్రైమాసికంలో ఐపీవో కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు మార్చిలో ఓపెన్ చేసే అవకాశం ఉంది. సెబీ ఈ పనులను వేగంగా చేస్తుంది. అందుకే ఇటీవల ఎల్‌ఐసీ చైర్మన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్‌ రంగంలో 74.5 శాతం వాటాతో మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను అందించి ప్రజల అభిమానం సంపాదిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories