LIC: ఈ పాలసీలో రోజు రూ.233 పొదుపు చేస్తే.. చివరకి 17 లక్షల ఆదాయం..!

LIC policy invest rs 233 daily in LIC Jeevan Labh Policy get 17 lakhs | Live News
x

LIC: ఈ పాలసీలో రోజు రూ.233 పొదుపు చేస్తే.. చివరకి 17 లక్షల ఆదాయం..!

Highlights

LIC: ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు గొప్ప పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది...

LIC: ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు గొప్ప పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఇందులో అన్ని వర్గాల కోసం అనువైన పాలసీలు ఉన్నాయి. మీరు కూడా సురక్షితమైన పెట్టుబడులతో మంచి ఆదాయం సంపాదించాలంటే LIC పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఫండ్‌ సృష్టించడానికి ఎల్‌ఐసీలో ఒక బంపర్ పాలసీ ఉంది. దానిపేరు జీవన్‌ లాభ్‌. ఇందులో మీరు తక్కువ మొత్తంతో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ప్రతిరోజు కేవలం రూ. 233 డిపాజిట్ చేయడం ద్వారా 17 లక్షల భారీ నిధిని పొందవచ్చు. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

LIC జీవన్ లాభ్

ఇది నాన్-లింక్డ్ పాలసీ. ఈ పాలసీకి షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ పెరిగినా, తగ్గినా అది మీ డబ్బుపై ప్రభావం చూపదు. అంటే ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితం. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఉదాహరణకు 23 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి 16 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం.

రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే పదేళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలకు దాదాపు రూ.7 వేలు ప్రీమియం కట్టాలి. రోజుకు రూ.233 ఆదా చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.17 లక్షలకు పైగా వస్తాయి. ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు.పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. ఈ పాలసీ తీసుకున్న వినియోగదారుడు మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై కూడా రుణ సదుపాయం పొందవచ్చు.

మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం, బోనస్ వంటివి పొందవచ్చు. ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీదారుడి మరణంపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీ కొనసాగుతున్న సమయంలో గానీ, ఒక వేళ ప్రీమియంలు పూర్తిగా చెల్లించిన తర్వాత పాలసీదారుడు మరణించినా అతని నామినీ డెత్‌ సమ్‌ అస్యూర్డ్‌, సింపుల్‌ రివర్షనరీ బోనష్‌, డెత్‌ బెనిఫిట్స్‌ అదనంగా బోనస్‌ అందుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories