ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు రూ. 12,000 పొందొచ్చు.. !

LIC Offering Saral Pension Plan for Monthly Income, Check Here for Full Details
x

LIC: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు రూ. 12,000 పొందొచ్చు.. !

Highlights

LIC: ఉద్యోగ విరమణ తర్వాత నెల నెల స్థిరమైన ఆదాయం కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.

LIC: ఉద్యోగ విరమణ తర్వాత నెల నెల స్థిరమైన ఆదాయం కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ప్రైవేట్‌ ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని కోరుకోవడం సర్వసాధారణం. అలాంటి వారి కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్తుకు భరోసా కల్పించే పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ సంస్థలు బెటర్‌ ఆప్షన్‌ అని తెలిసిందే.

ఇలాంటి బెస్ట్ స్కీమ్స్‌ను అందిస్తున్న వాటిలో పోస్టాఫీస్‌తో పాటు ఎల్‌ఐసీ ఒకటి. భారత ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ సంస్థ ఎల్‌ఐసీ నెలవారీ పెన్షన్‌ పొందాలనుకునే వారి కోసం సరల్‌ పెన్షన్‌ ప్లాన్‌ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. పదవి విరమణకు ముందు మీ పీఎఫ్‌ ఫండ్‌, గ్రాట్యుటీ మొత్తాన్ని ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగ విరమణ తర్వాత నెలనెల పెన్షన్‌ పొందొచ్చు.

ఈ ప్లాన్‌లో 40 ఏళ్లు మించిన వాళ్లు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు. ఈ పాలసీ కింద, మీరు నెలవారీ కనీస యాన్యుటీని రూ. 1,000 కొనుగోలు చేయాలి. ప్రత్యామ్నాయంగా, మీరు త్రైమాసికానికి కనీసం రూ. 3,000, సెమీ-వార్షిక రూ. 6,000 లేదా సంవత్సరానికి రూ. 12,000 ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీస వార్షిక యాన్యుటీని రూ. 12,000 తీసుకోవచ్చు. ఈ పాలసీలో పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు, మీకు నచ్చినంతా పెట్టుబడి పెట్టొచ్చు. ఒకే ప్రీమియం చెల్లింపు తర్వాత, మీరు మీ పెన్షన్‌ను ఏటా, సెమీ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీగా పొందవచ్చు.

42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల వార్షికాన్ని కొనుగోలు చేస్తే సదరు వ్యక్తికి నెలవారీ రూ. 12,388 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ రూ. 10 లక్షల ప్రీమియం పెట్టుబడిగా పెడితే.. రూ.50,250 వార్షిక పెన్షన్ పొందుతారు. ఇక ఒకవేళ రూ. 2.50 లక్షలు పెట్టుబడిగా పెట్టారనుకుంటే మీకు నెలకు రూ. 1000 పెన్షన్‌ లభిస్తుంది. ఇలా మీరు పెట్టుబడి పెట్టేదానికి అనుగుణంగా మీ పెన్షన్‌ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories