కూతురి భవిష్యత్‌ కోసం ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. తక్కువ ప్రీమియంతో మంచి రాబడి..!

LIC Kanyadan Policy Check for all Details
x

కూతురి భవిష్యత్‌ కోసం ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. తక్కువ ప్రీమియంతో మంచి రాబడి..!

Highlights

LIC Kanyadan Policy: ఏ తండ్రి అయినా కూతురి భవిష్యత్‌ని మెరుగుపరచాలనుకుంటే ఎల్‌ఐసీ అందించే ఈ పాలసీలో పెట్టుబడి పెట్టాలి.

LIC Kanyadan Policy: ఏ తండ్రి అయినా కూతురి భవిష్యత్‌ని మెరుగుపరచాలనుకుంటే ఎల్‌ఐసీ అందించే ఈ పాలసీలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మంచి జీవితాన్ని కూతురికి అందించే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ ప్లాన్‌ ఏంటని ఆలోచిస్తున్నారా.. దాని పేరు కన్యాదాన్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం ఏ తండ్రి అయినా తన కుమార్తెకు మెరుగైన విద్య, పెళ్లి కోసం ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. వారి భవిష్యత్‌ని సరైన దిశలో చక్కదిద్దవచ్చు.

కన్యాదాన్ పాలసీ ప్రకారం కుమార్తె పేరుపై 22 సంవత్సరాల పాటు నెలవారీ రూ. 3600 ప్రీమియం చెల్లిస్తే 25 సంవత్సరాల తర్వాత రూ. 26 లక్షలు జమవుతాయి. ఈ పాలసీకి నెలవారీ ప్రీమియం రూ. 3600 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా తక్కువ ప్రీమియంతో కూడా ప్లాన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా కావాలంటే అధిక ప్రీమియం కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ప్రకారం పాలసీ మెచ్యూరిటీ తర్వాత దాని ప్రయోజనం అందుతుంది.

పాలసీపై రుణ సౌకర్యం

ఈ పాలసీ మెచ్యూరిటీ ప్రయోజనం గురించి మాట్లాడినట్లయితే పాలసీదారుడు హామీ మొత్తంతో పాటు సాధారణ రివిజనరీ బోనస్ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇది కాకుండా అదనపు బోనస్ ప్రయోజనం లభిస్తుంది. పాలసీని కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత రుణ ప్రయోజనం ఉంటుంది. ప్రీమియం డిపాజిట్‌పై 80C కింద మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం. పాలసీకి సమ్ అష్యూర్డ్ పరిమితి కనిష్టంగా రూ.1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది గరిష్ట పరిమితి లేదు.

పాలసీ వ్యవధి

ఈ పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాలు. కుమార్తె తండ్రి పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 50 సంవత్సరాలు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 65 సంవత్సరాలు. కుమార్తె వయస్సు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల మధ్య ఉండాలి. కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఈ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం వార్షికంగా చెల్లించవచ్చు.

మరణిస్తే చాలా డబ్బు

ఈ పాలసీ తీసుకున్న కొంత కాలానికి తండ్రి చనిపోతే అతని కుటుంబం ఈ పాలసీని చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తం మాఫీ అవుతుంది. పాలసీ ఉచితంగా అమలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం నామినీకి అందుతుంది. అలాగే పాలసీ మిగిలిన సంవత్సరాలలో ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో 10% కుమార్తె పొందుతుంది. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షలు, సహజ మరణమైతే రూ.5 లక్షలు అందజేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories