LIC: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. ప్రతిరోజు రూ. 238 పొదుపు చేస్తే రూ. 54 లక్షల ఫండ్‌..!

LIC Jeevan Labh Scheme Daily Rs.238 Deposit Rs.54 Lakhs at Maturity
x

LIC: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. ప్రతిరోజు రూ. 238 పొదుపు చేస్తే రూ. 54 లక్షల ఫండ్‌..!

Highlights

LIC: దేశంలో ఎల్‌ఐసీ అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరికి పాలసీలను ప్రారంభించింది

LIC: దేశంలో ఎల్‌ఐసీ అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరికి పాలసీలను ప్రారంభించింది. ఎల్‌ఐసీ వల్ల ఎంతోమంది తమ జీవితాలు బాగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలని రోడ్డున పడకుండా ఆదుకుంది. అందుకే ఎల్‌ఐసీ అంటే ఒక నమ్మకం. ఒక భరోసాగా చెబుతారు. ఇందులో భాగంగా ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన జీవన్‌ లాభ్‌ అనే పాలసీ గురించి చాలామందికి తెలియదు. దీని గురించి పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పథకంలో మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్ రెండూ ఉంటాయి. స్కీం ప్రకారం పాలసీ వ్యవధిలోపు పాలసీదారు మరణిస్తే, మెచ్యూరిటీ మొత్తం నామినీకి అందిస్తారు. ఒకవేళ పాలసీ నిర్ణీత సమయం ముగిసే వరకు జీవించి ఉండి అన్ని ప్రీమియంలను చెల్లిస్తే అతను/ఆమె 'మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్' మొత్తాన్ని పొందుతారు. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీలో కనీసం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు.

ఈ పథకంలో మెచ్యూరిటీ కోసం వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ఏ వ్యక్తి అయినా 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉంటుంది. ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.

మీకు 25 సంవత్సరాల వయసులో ఈ పాలసీ తీసుకుంటే రూ. 20 లక్షలను ప్రాథమిక బీమా మొత్తంగా ఎంచుకోవాలి. GST మినహాయించి సంవత్సరానికి ₹86954 ప్రీమియం చెల్లించాలి. దీని ధర ప్రతిరోజు దాదాపు ₹ 238 అవుతుంది. మీరు 50 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అంటే 25 సంవత్సరాల తర్వాత మొత్తం మెచ్యూరిటీ ₹ 54.50 లక్షలు అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories