LIC బచత్ ప్లస్ ప్లాన్.. తక్కువ ప్రీమియం అధిక రాబడి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

LIC Bachat Plus Plan low Premium High Return Find out Full Details
x

LIC బచత్ ప్లస్ ప్లాన్.. తక్కువ ప్రీమియం అధిక రాబడి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Highlights

LIC Bachat Plus Plan: ఇన్సూరెన్స్‌ రంగంలో ఎల్‌ఐసీ కంపెనీ పాలసీదారులకు భద్రతతో పాటు కచ్చితమైన రాబడి అందిస్తుంది.

LIC Bachat Plus Plan: ఇన్సూరెన్స్‌ రంగంలో ఎల్‌ఐసీ కంపెనీ పాలసీదారులకు భద్రతతో పాటు కచ్చితమైన రాబడి అందిస్తుంది. అందుకే అగ్రస్థానంలో దూసుకెళుతుంది. కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌ వస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఇది వారికి, వారి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బచత్‌ ప్లస్ అనే ప్లాన్‌ని అమలు చేస్తుంది. ఈ ప్లాన్ డబుల్ ప్రయోజనాలతో వస్తుంది. ఇందులో భద్రతతో పాటు పొదుపు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. తక్కువ ప్రీమియంలతో అధిక రాబడి కారణంగా ఈ ప్లాన్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్లాన్ మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు మాత్రమే. 90 రోజుల పిల్లలు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు.

ఒక వ్యక్తి 90 రోజుల పిల్లల కోసం కనీసం రూ. 1 లక్ష పాలసీని తీసుకోవచ్చు. మీరు పాలసీపై రుణం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం ఒకేసారి లేదా పరిమిత వ్యవధిలో చెల్లించవచ్చు. సింగిల్ ప్రీమియం, పరిమిత ప్రీమియం ప్లాన్‌ల కింద మరణ ప్రయోజనాన్ని చెల్లించడానికి వేర్వేరు నియమాలు ఉన్నాయి. పరిమిత ప్రీమియం ప్లాన్ కింద పాలసీదారు మరణించినప్పుడు నామినీకి బీమా మొత్తం 10 రెట్లు వరకు చెల్లిస్తారు. పాలసీని పూర్తి చేసే సమయంలో పాలసీదారు జీవించి ఉంటే వారికి ఏకమొత్తం ఇస్తారు. కానీ పాలసీ ప్రీమియం వరుసగా 5 సంవత్సరాలు మాత్రం చెల్లించాలి.

ఒకే ప్రీమియం ప్లాన్ కింద ఒక వ్యక్తి 90 రోజుల పిల్లల కోసం కూడా బచాట్ ప్లస్ పాలసీని తీసుకోవచ్చు. ఒక వ్యక్తి పరిమిత ప్రీమియం ప్లాన్ కింద ఈ పాలసీని తీసుకోవాలనుకుంటే అతని వయస్సు 44 ఏళ్లు మించకూడదు. ప్రీమియం చెల్లింపులో జాప్యానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. పాలసీదారుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాలసీ తీసుకునే వ్యక్తికి పన్ను మినహాయింపు సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ పాలసీ కోసం మీరు ప్రీమియంను ఒకేసారి చెల్లించవచ్చు లేదా 5 సంవత్సరాల పరిమిత కాలానికి చెల్లించవచ్చు. మీరు ప్రతి సంవత్సరం, ప్రతి అర్ధ సంవత్సరం, త్రైమాసికం లేదా ప్రతి నెలా కూడా వాయిదాను చెల్లించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories