LIC Policy: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. కేవలం వారికి మాత్రమే..!

LIC Aadhaar Shila Policy for Women Only | LIC Aadhar Shila Policy Benefits
x

LIC Policy: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. కేవలం వారికి మాత్రమే..!

Highlights

LIC Policy: దేశంలోనే అతి పెద్ద జీవితబీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎంతో మందికి...

LIC Policy: దేశంలోనే అతి పెద్ద జీవితబీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎంతో మందికి చేయూతనిస్తోంది. ముఖ్యంగా సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా పాలసీలని ప్రవేశపెట్టి వారి కుటుంబాలకి అండగా నిలుస్తోంది. సంపాదించే వ్యక్తి కోల్పోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుతుంది. అందుకే ఎల్‌ఐసీ అంటే ఒక భద్రత ఒక నమ్మకం. అయితే ఎల్‌ఐసీ మహిళల కోసం కూడా ఒక ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ పేరు ఎల్‌ఐసీ ఆధార్ శిలా. ఇది కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన మహిళలు ఈ పాలసీ తీసుకోవచ్చు. సదరు పాలసీదారు మరణిస్తే బీమా డబ్బులను నామినీకి అందజేస్తారు. ఒకవేళ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే పాలసీ డబ్బులు వారికే అందిస్తారు. ఉదాహారణకి మహిళలు 31 ఏళ్ల వయసులో రూ.3 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు మీరు సంవత్సరానికి దాదాపు రూ.10,700 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.29 ఆదా చేస్తే సరిపోతుంది.

ఇలా చేస్తే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3.97 లక్షలు (బీమా మొత్తం+ లాయల్టీ) వస్తాయి. మీరు ప్రీమియం డబ్బులను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించొచ్చు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.75 వేల మొత్తానికి పాలసీ పొందొచ్చు. గరిష్టంగా రూ.3 లక్షల వరకు మొత్తానికి పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ పాలసీలో ఇన్సూరెన్స్‌ కవరేజీతో పాటు అధిక రాబడి కూడా పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories