బంగారు నగలు అమ్మేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి.. సరైన ధరను పొందండి..

Learn These Things When Selling Gold Jewelry get the Right Price
x

బంగారు నగలు అమ్మేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి.. సరైన ధరను పొందండి..

Highlights

Gold Jewelry: చాలామంది బంగారు నగలు అమ్మేటప్పుడు సరైన ధరని పొందలేరు. ఎందుకంటే వాటిని ఎలా విక్రయించాలో వారికి తెలియదు.

Gold Jewelry: చాలామంది బంగారు నగలు అమ్మేటప్పుడు సరైన ధరని పొందలేరు. ఎందుకంటే వాటిని ఎలా విక్రయించాలో వారికి తెలియదు. వినియోగదారుల అవసరాన్ని అందిపుచ్చుకొని వ్యాపారులు వారిని మోసం చేస్తారు. నాణ్యమైన బంగారానికి తక్కువ లెక్కలు చూసి సగం ధర మాత్రమే చెల్లిస్తారు. అందుకే బంగారు నగలు విక్రయించడానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది.

1. ఎక్కువ ధరపై వాగ్దానాలను నమ్మకండి

చాలా బంగారం దుకాణదారులు మిగిలినవారికంటే ఎక్కువ ధరను చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. అయితే వినియోగదారులు ఇలాంటి వారిని నమ్మవద్దు. వాస్తవానికి అలాంటివారు మీ బంగారంపై తక్కువ ధరని చెల్లిస్తారు. అధిక ధరలకు బంగారాన్ని కొనుగోలు చేస్తామని చెప్పే దుకాణదారులు బంగారం పరిమాణంలో మోసం చేస్తున్నారు. ఆభరణాలలో రాళ్లు ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ బంగారం స్వచ్ఛతను తెలుసుకోవాలనుకుంటే ఆభరణాలను MMTC-PMMPకి తీసుకెళ్లవచ్చు. ఇక్కడ అత్యాధునిక XRF సాంకేతికతతో ఖచ్చితత్వాన్ని కొలుస్తారు. ఇక్కడి నుంచి సమాచారం తీసుకుని నగలు విక్రయిస్తే నష్టం ఉండదు.

2. రాయిపై రుద్దడం నమ్మకండి

బంగారు వ్యాపారులు ఆభరణాలను పరీక్షించడానికి టచ్‌స్టోన్‌లను ఉపయోగిస్తారు. దీనిపై యాసిడ్ పోయడం ద్వారా టచ్‌స్టోన్ రంగు మారుతుంది. దుకాణదారులు రంగు మార్పు ఆధారంగా ఆభరణాల క్యారెట్‌ను నిర్ధారిస్తారు. ఈ సాంకేతికత పాతది. అయితే ఇందులో దుకాణదారులకు ప్రయోజనం ఉండడంతో వాటిని కొనసాగిస్తున్నారు. టచ్‌స్టోన్ ట్రిక్ పరీక్ష మీ బంగారం విలువను 3 నుంచి 5 శాతం వరకు తగ్గిస్తుంది. మీ ఆభరణాల విలువ రూ. 200,000 అని అనుకుంటే ఈ రాయి కారణంగా వినియోగదారులు రూ.10,000 నష్టపోతారు. BIS సర్టిఫైడ్ షాప్ లేదా స్టోర్‌కి వెళితే, MMTC-PAMP నుంచి ధృవీకరించబడిన ఇంజనీర్లు ఉన్నందున అలాంటి నష్టం ఉండదు. వారు ఆధునిక పద్ధతిలో బంగారాన్ని పరీక్షిస్తారు.

3. అందరి ముందు ఆభరణాలను పరీక్షించాలి

బంగారాన్ని పరీక్షించడానికి దుకాణదారులు కౌంటర్ వెనుక ఉన్న యంత్రంపై పని చేస్తారు. దానిని మీరు చూడలేరు. అందుకే CCTV కెమెరాలు ఉన్న దుకాణాలలో మాత్రమే ఆభరణాలను విక్రయించండి.

సర్టిఫైడ్ దుకాణదారులు ముందుగా మొత్తం ఆభరణాలను తూకం వేసి ఆ తర్వాత బంగారాన్ని కరిగించి మళ్లీ తూకం వేస్తారు. మీరు ఈ పనులన్నింటినీ ప్రత్యక్షంగా చూడవచ్చు. బంగారాన్ని కరిగించి డి-అయోనైజ్డ్ నీటిలో ఉంచడం ద్వారా శుభ్రపడుతుంది. ఈ ఆభరణాలలో ఏదైనా రాయి ఉంటే దానిని తూకం వేసి కరిగించే ముందు తొలగిస్తారు. ఇది మీ బంగారం పూర్తి విలువను తెలియజేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories