Wedding Gifts Tax Rules: పెళ్లిలో వరుడికి ఇచ్చే కానుకలపై పన్ను చెల్లిస్తారా..!

know the Tax Rules and Regulations on cash and Expensive items given to the Groom at the Wedding
x

Wedding Gifts Tax Rules: పెళ్లిలో వరుడికి ఇచ్చే కానుకలపై పన్ను చెల్లిస్తారా..!

Highlights

Wedding Gifts Tax Rules: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది.. హడావిడి మొదలైంది. చాలామంది ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

Wedding Gifts Tax Rules: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది.. హడావిడి మొదలైంది. చాలామంది ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లికోసం యువతీ యువకులు చాలా కలలు కంటారు. తన పెళ్లి హుందాగా, లగ్జరీగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎన్ని డబ్బులైనా ఖర్చుచేస్తారు. పెళ్లిలో వధూవరుల తల్లిదండ్రులు, బంధువులు లక్షల విలువైన బహుమతులను వరుడికి అందజేస్తారు. ఇందులో డబ్బు, వాహనాలు, ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. వీటన్నిటిపై ట్యాక్స్‌ చెల్లించాలా అనే దానిపై కొందరికి అనుమానం ఉంటుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పెళ్లి కానుకలపై ఎంత పన్ను విధిస్తారు?

వివాహ సమయంలో వధువు లేదా వరుడికి బంధువులు లేదా తల్లిదండ్రులు ఏదైనా బహుమతిని ఇస్తే దానిపై ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందులో భూమితో పాటు బంగారం, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు ఉంటాయి.

బహుమతులపై ఏదైనా పరిమితి ఉందా?

పెళ్లిలో ఇచ్చే బహుమతుల విలువకు సంబంధించి ఎటువంటి పరిమితి లేదు. వధూవరులకు ఎవరైనా విలువైన బహుమతిని ఇవ్వవచ్చు. అది పూర్తిగా పన్ను రహితం. అయితే బహుమతి ఇస్తున్న వ్యక్తి దాని మూలం గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.

పెళ్లి తర్వాత స్వీకరించిన బంగారంపై పన్ను ఉంటుందా..?

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వివాహానంతరం ఏదైనా బంగారం లేదా ఆభరణాలను ఆమె భర్త, సోదరుడు, సోదరి లేదా ఆమె తల్లిదండ్రులు లేదా అత్తమామలు లేదా అత్తగారు బహుమతిగా ఇస్తే దానిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

నగదు రూపంలో ఎంత లావాదేవీలు చేయవచ్చు?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒక రోజులో రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోలేడు. కొత్తగా పెళ్లయిన జంట అందుకున్న బహుమతుల విలువ రూ. 50,000 అయితే పర్వాలేదు. పెళ్లైన సంవత్సరం వరకు రూ. 50,000 వరకు విలువైన బహుమతులపై పన్ను ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories