LIC Policy: రోజుకు రూ.166లు.. చేతికి రూ.23 లక్షలు.. ఎల్‌ఐసీ పెన్షన్ ప్లస్ ప్లాన్ ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..!

LIC Policy: రోజుకు రూ.166లు.. చేతికి రూ.23 లక్షలు.. ఎల్‌ఐసీ పెన్షన్ ప్లస్ ప్లాన్ ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..!
x
Highlights

New Pension Plus Plan Table 867: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక బీమా పాలసీలను ప్రజల కోసం అందిస్తోంది.

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక బీమా పాలసీలను ప్రజల కోసం అందిస్తోంది. ఎండోమెంట్ పాలసీ , షేర్ లింక్డ్ పాలసీ మొదలైన వివిధ రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. LIC కొత్త పెన్షన్ ప్లస్ పాలసీ (LIC New Pension Plus Policy) వీటిలో ఒకటి. ఇది పదవీ విరమణ తర్వాత హ్యాపీగా జీవించేందుకు సరైన ఆర్థిక ప్రణాళికలాంటింది. మొత్తం ప్రీమియం ఒకేసారి చెల్లించవచ్చు లేదా ప్రీమియంను వాయిదాల పద్ధతిలో క్రమం తప్పకుండా చెల్లించవచ్చు. ఇది మెచ్యూర్ అయినప్పుడు, మీరు మొత్తం రాబడిని ఒకేసారి పొందవచ్చు. లేదా మీరు సంవత్సరానికి నిర్ణీత మొత్తాన్ని స్వీకరించడాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో పెన్షన్ గ్రోత్ ఫండ్, పెన్షన్ బాండ్ ఫండ్, పెన్షన్ సెక్యూర్డ్ ఫండ్ , పెన్షన్ బ్యాలెన్స్‌డ్ ఫండ్ అనే నాలుగు రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి.

LIC కొత్త పెన్షన్ ప్లస్ పాలసీ కాలపరిమితి?

ఈ పాలసీ (LIC New Pension Plus Plan Table 867) 10 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఈ పాలసీ 25 ​​ఏళ్లలోపు వారికి అందుబాటులో లేదు. కనీస వయస్సు 25 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు. ఇది 5 నుంచి 15 శాతం వార్షిక రేటుతో రాబడిని ఇస్తుంది.

LIC కొత్త పెన్షన్ ప్లస్ పాలసీకి ప్రీమియం?

ఒకేసారి ప్రీమియం చెల్లించాలనుకుంటే, కనీస మొత్తం రూ. 1 లక్ష చెల్లించాలి. పరిమితి లేదు. అలాగే సాధారణ వాయిదాలలో చెల్లిస్తే, నెలకు చెల్లించాల్సిన మొత్తం కనీసం రూ. 3,000 ఉండాలి. సంవత్సరానికి ఒకసారి చెల్లించాలంటే, కనీస మొత్తం రూ. 30,000. మీకు పాలసీ పీరియడ్ తర్వాత ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకుని, అందుకు తగ్గ ప్రీమియాన్ని ఎంచుకోండి.

LIC కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్‌లో పెట్టుబడి, లాభం ఎంతుంటుంది?

LIC కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ పాలసీ కాబట్టి స్థిరమైన రాబడి ఉండదు. సంవత్సరానికి 8 శాతం చొప్పున రిటర్న్‌లు అనుకున్నా , 20 ఏళ్లపాటు నెలకు రూ .5,000 చెల్లిస్తే దాదాపు రూ .23 లక్షల వరకు రిటర్న్‌లు వస్తాయి. 15 శాతం చొప్పున లెక్కిస్తే రూ.50 లక్షలకు పైగా చేతికి వస్తుంది.

అలాగే ఒకేసారి రూ .50 లక్షలు ప్రీమియం చెల్లిస్తే 4 శాతం చోప్పున లెక్కిస్తే 10 ఏళ్ల తర్వాత ఆ డబ్బు రూ .93 లక్షలకు పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories