భారీగా వడ్డించిన జియో! కొత్త టారిఫ్ ప్లాన్లు ఇవే!!

భారీగా వడ్డించిన జియో! కొత్త టారిఫ్ ప్లాన్లు ఇవే!!
x
Jio logo
Highlights

అన్ని మొబైల్ కంపెనీలు తమ టారిఫ్ లు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు జియో కూడా తన కొత్త టారిఫ్ లను ప్రకటించింది.

డిసెంబర్ లో టారిఫ్ లు పెంచనున్నట్లు ప్రకటించిన జియో తాజాగా తన కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్ల టారిఫ్ ల పెంపు 40 శాతం వరకు ఉంది. జియో తన ప్లాంలను రెండు రకాలుగా విభజించింది. ఎఫర్డబుల్ ప్లాన్ పేరుతొ తక్కువ నెలంతా కలిపి కొంత మొత్తం డేటా ఇచ్ఛేలా ఈ ప్లాన్ ఉంది. ఇక రెండో రకం ఇప్పుడు అందిస్తున్న ప్లాన్ ల లానే ఉన్నా టారిఫ్ లు విపరీతంగా పెంచింది. జియో ప్రకటించిన ప్లాన్ లు ఇలా ఉన్నాయి..

Affordable Plans :

​రూ.129 ప్లాన్..

జియో కొత్త ప్లాన్ రూ.129తో రీచార్జ్ చేసుకుంటే 2 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నిమిషాలను అందిస్తారు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

​​రూ.329 ప్లాన్..

ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే మొత్తంగా 6 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ కు చేసుకోవడానికి 3000 నిమిషాలను అందిస్తారు. ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 84 రోజులు.

​రూ.1299 ప్లాన్..

జియో వెల్లడించిన దీర్ఘకాలిక ప్లాన్లలో ఈ ప్లాన్ కూడా ఒకటి. ఈ రూ.1,299 ప్లాన్ ద్వారా మొత్తంగా 24 జీబీ డేటా అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 ఉచిత నిమిషాలను అందిస్తారు. దీని వ్యాలిడిటీ 365 రోజులు.

Regular Plans :

రూ.199 ప్లాన్..

రూ.199 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడం కోసం 1000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు.

​రూ.249 ప్లాన్..

ఈ రూ.249 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటాను అందించనున్నారు. జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ సౌకర్యం ఇందులో కూడా ఉంది. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు.

​రూ.349 ప్లాన్..

ఈ రూ.349 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటాను అందించనున్నారు. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్ పై ప్లాన్ల తరహాలోనే చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నిమిషాలను అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

రూ.399 ప్లాన్..

రూ.399 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడం కోసం 2,000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.

​రూ.444 ప్లాన్..

ఈ రూ.444 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తారు. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 2,000 ఉచిత నిమిషాలను అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 56 రోజులు.

​రూ.555 ప్లాన్..

రూ.555 ప్లాన్ లో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3,000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

రూ.599 ప్లాన్..

ఈ రూ.599 ప్లాన్ ను రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా అందిస్తారు. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3,000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

​రూ.2,199 ప్లాన్..

ఈ రూ.2,199 ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 ఉచిత నిమిషాలను అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 365 రోజులు.

​ఈ ప్లానులన్నిటికీ అదనంగా కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నట్టు ప్రకటించింది జియో. దీని ప్రకారం అన్ని రీచార్జ్ ల పై జియో టీవీ, జియో సినిమా, జియో సావ్న్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో హెల్త్ హబ్ వంటి జియో యాప్స్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో టీవీ ద్వారా 600కు పైగా చానెళ్లు, 100కు పైగా హెచ్ డీ చానెళ్లు ఉచితంగా చూడవచ్చు. జియో సినిమా యాప్ లో 10 వేలకు పైగా సినిమాలు, లక్షల కొద్దీ టీవీ షోలు, డిస్నీ, మార్వెల్, పిక్సర్, లూకాస్, వూట్, ఈరోస్ నౌ, ఆల్ట్ బాలాజీ, పారామౌంట్, సన్ నెక్స్ట్ వంటి వాటికి సంబంధించిన కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది.

ఇక జియో సావ్న్ యాప్ లో 5 కోట్లకు పైగా పాటలను ఉచితంగా వినవచ్చు. జియో న్యూస్ యాప్ ద్వారా 150కు పైగా లైవ్ న్యూస్ చానెల్స్, 300కు పైగా న్యూస్ పేపర్ ఎడిషన్స్, 800కు పైగా మ్యాగజైన్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో సెక్యూరిటీ ద్వారా నార్టన్ ప్రీమియం మొబిలిటీ సెక్యూరిటీ సూట్ లభిస్తుంది. జియో క్లౌడ్ ద్వారా 5 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories