Income Tax Refund Status: మీకు ఐటీ రిఫండ్ రాలేదా? పాన్ నంబర్​తో నిమిషాల్లోనే స్టేటస్ తెలుసుకోండి ఇలా

itr status check how to check income tax refund status online
x

Income Tax Refund Status: మీకు ఐటీ రిఫండ్ రాలేదా? పాన్ నంబర్​తో నిమిషాల్లోనే స్టేటస్ తెలుసుకోండి ఇలా

Highlights

ITR Refund Status: మీకు ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా? ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారా. అయితే మీ రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో అర్థం కావడం లేదా. అయితే కొన్ని పద్దతులను ఫాలో అయితే చాలు..సులభంగా ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

ITR Refund Status: గత ఏడాది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫై చేసి..రిఫండ్ కోసం ఎదురుచూసే వారి కోసమే ఈ వార్త. మీ రిటర్నుల ప్రాసెసింగ్ ఏ స్టేజీలో ఉందో తెలుసుకోవాలనుకుంటే..ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పాన్ కార్డు ఉంటే చాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఈ పాన్ కార్డుతో క్షణంలో మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

పాన్ కార్డును తో ఆన్ లైన్ లో రెండు పద్దతుల ద్వారా సులభంగా ఐటీ రీఫండ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఆదాయపుపన్ను ఇ ఫైలింగ్ పోర్టల్. రెండవది..ఎన్ ఎస్ డీఎల్ టిన్ వెబ్ సైట్. ఈ రెండింటి ద్వారా సింపుల్ గా స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందు మీకు కొన్ని విషయాలు తప్పకుండా తెలియాలి. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ ఇ ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యేందుకు వాలిడ్ ఐడీ, పాస్ వర్డ్ తప్పనిసరిగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ పాన్ కార్డు కచ్చితంగా ఆధార్ తో లింక్ అయ్యి ఉండాల్సిందే. అలాగే మీ ఐటీఆర్ ఫైలింగ్ అక్ నాలెడ్ట్ మెంట్ నెంబర్ అవసరం ఉంటుందన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి.

ఇ-ఫైలింగ్ పోర్టల్‌ ద్వారా ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేయడం ఎలా?

-ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ను https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.

-అందులో లాగిన్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

-ఇప్పుడు స్క్రీన్ మీద మీ డీటైయిల్స్ కనిపిస్తాయి. అందులో ఈ ఫైలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆప్షన్ లో వ్యూ ఫైల్డ్ రిటర్స్ పై క్లిక్ చేయాలి.

-తర్వాత మీ ఐటీఆర్ కు సంబంధించిన అసెస్ మెంట్ ఇయర్ ను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.

-దీనిలో మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ కు సంబంధించి పూర్తి వివరాలను చూడవచ్చు.

ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

-ముందుగా మీరు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ వెబ్ సైట్ https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html ఓపెన్ చేయాలి.

-ఇందులో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి అసెస్మెంట్ ఇయర్ ఎంటర్ చేయాలి.

-తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ పై నొక్కాలి.

-అంతే సింపుల్ మీ రీఫండ్ స్టేటస్ కు సంబంధించిన వివరాలు డిస్ ప్లే పై కనిపిస్తాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories