SIP Benefits: సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం.. భవిష్యత్‌లో అధిక ప్రయోజనాలు..!

It Is Better To Invest Through SIP You Will Get High Benefits In The Future
x

SIP Benefits: సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం.. భవిష్యత్‌లో అధిక ప్రయోజనాలు..!

Highlights

SIP Benefits: స్టాక్ మార్కెట్‌ గందరగోళం మధ్య అక్టోబర్‌లో అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో SIP ద్వారా దాదాపు 17,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు.

SIP Benefits: స్టాక్ మార్కెట్‌ గందరగోళం మధ్య అక్టోబర్‌లో అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో SIP ద్వారా దాదాపు 17,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు సిప్ ద్వారా వచ్చిన పెట్టుబడులలో ఇదే రికార్డు. స్మాల్ క్యాప్ ఫండ్స్ దాదాపు రూ.4,500 కోట్ల నికర ఇన్ ఫ్లోను చూసింది. అక్టోబర్‌లో సిప్ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడి రూ.16,928 కోట్లు. సిప్ ఖాతాల సంఖ్య 17 లక్షలు దాటింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక రికార్డు. SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ఎందుకు మంచిదో ఈ రోజు తెలుసుకుందాం.

చిన్నపెట్టుబడి

SIP ద్వారా చాలా మ్యూచువల్ ఫండ్ పథకాలలో నెలకు రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇటీవల సంపాదించడం ప్రారంభించిన చాలా మంది వ్యక్తులు భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. SIP ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణీత కాల పరిమితి కోసం డిపాజిట్ చేసేది కాదు. ఒకవేళ మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేకపోతే కొన్ని నెలల పాటు వదిలేయవచ్చు. ఇన్వెస్ట్ చేయడం కూడా ఆపేయవచ్చు. కొన్ని నెలల తర్వాత మళ్లీ డబ్బును కలిగి ఉంటే మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.

రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌

చాలామంది ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నారు. కానీ SIPతో మంచి విషయం ఏంటంటే క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం. రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా రిస్క్ శాతం తగ్గుతుంది. ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పతనమైతే రూ.8,000 విలువైన యూనిట్లు మాత్రమే లభిస్తాయి. వచ్చే నెలలో కూడా రూ.10,000 ఇన్వెస్ట్ చేసి మార్కెట్ మెరుగుపడితే రూ.12,000 విలువైన యూనిట్లు లభిస్తాయి. ఈ విధంగా మీరు సగటు ధరను పొందుతారు.

కాంపౌండింగ్ ప్రయోజనం

SIP ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం పొందుతారు. దీర్ఘకాలికంగా అధిక రాబడిని పొందుతారు. SIP ద్వారా పెట్టుబడి పెట్టడం సులభం ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవాలి. తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలు తీసుకొస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories