PF Money: ఉద్యోగం మారారా.. ఫీఎఫ్‌ డబ్బులు విత్‌ డ్రా చేశారా..!

Is it Right or Wrong to Withdraw PF Money after Changing Job Know Complete Details
x

PF Money: ఉద్యోగం మారారా.. ఫీఎఫ్‌ డబ్బులు విత్‌ డ్రా చేశారా..!

Highlights

PF Money: చాలామంది ఉద్యోగాన్ని కోల్పోయినా లేదా పాత ఉద్యోగాన్ని వదిలివేసినా ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌ డ్రా చేసుకోవాలనుకుంటారు.

PF Money: చాలామంది ఉద్యోగాన్ని కోల్పోయినా లేదా పాత ఉద్యోగాన్ని వదిలివేసినా ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌ డ్రా చేసుకోవాలనుకుంటారు. కానీ నిపుణులు ఎల్లప్పుడూ PF బ్యాలెన్స్‌ను విత్‌ డ్రా చేయకూడదని చెబుతున్నారు. మీరు ఒకవేళ డబ్బును విత్‌డ్రా చేసుకుంటే భవిష్యత్‌ కోసం చేసిన పెట్టుబడిని కోల్పోతారు. అంతేకాకుండా ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్ (EPS) ద్వారా రెగ్యులర్ పెన్షన్ పొందే అవకాశాలు తగ్గుతాయి. దీని వెనుక అసలు కారణం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

ఉద్యోగం మానేసిన తర్వాత అత్యవసర సమయంలో మాత్రమే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలి. ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా మీ PF ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ వస్తూనే ఉంటుంది. అలాగే మీరు కొత్త సంస్థలో కొత్త ఉద్యోగం పొందిన వెంటనే దాన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. EPFO అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఉద్యోగం లేని వ్యక్తి PF ఖాతాకు సహకరించలేరు. ఉద్యోగి ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తర్వాత EPFకి సహకరించలేరు. ఎందుకంటే సభ్యుడు చేసిన ఏదైనా సహకారం తప్పనిసరిగా యజమాని యొక్క వాటాతో సరిపోలాలి.

మీరు పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త కంపెనీలో చేరినట్లయితే PF మొత్తాన్ని కొత్త కంపెనీకి బదిలీ చేయవచ్చు. దీనివల్ల మీ PF ఖాతా నిరంతరంగా నడుస్తున్నట్లు పరిగణిస్తారు. మీ పెన్షన్ పథకం క్లోజ్‌ కాకుండా ఉంటుంది. మీరు రిటైర్మెంట్‌ తర్వాత విత్‌ డ్రా చేసుకోపోతే PF డిపాజిట్లపై వడ్డీని వస్తూనే ఉంటుంది. రిటైర్మెంట్‌ చేసిన మూడు సంవత్సరాల తర్వాత మీ ఖాతా నిష్క్రియంగా మారుతుంది. ప్రావిడెంట్ ఫండ్ బకాయిల విత్‌ డ్రాకు కాలపరిమితి లేదు. కానీ నేటి రోజుల్లో ప్రభుత్వం కోవిడ్ వల్ల వెంటనే డబ్బు విడుదల చేస్తుంది.

PF డబ్బును విత్‌డ్రా చేస్తే నష్టం ఏంటి..?

PF డబ్బును విత్‌డ్రా చేయడం వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా నిర్ణీత వేతనంపై పీఎఫ్‌ ఎంత కట్‌ అవుతుందో తెలియాలి. దీనివల్ల రిటైర్మెంట్‌ చేసినప్పుడు మీకు ఎంత డబ్బు వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఒక వ్యక్తి జీతం నెలకు రూ.15 వేలు అనుకుందాం. ప్రస్తుత పీఎఫ్ వడ్డీ రేటు ప్రకారం అతనికి 8.15% వడ్డీ లభిస్తుంది. రూ.15 వేలు వేతనం ప్రకారం నెలకు రూ.2351 పీఎఫ్ కట్ అవుతుంది. 10 సంవత్సరాల్లో ఈ మొత్తం రూ.4.34 లక్షలు అవుతుంది. 20 ఏళ్లలో ఈ మొత్తం రూ.14.11 లక్షలకు పెరుగుతుంది. అతను 20 సంవత్సరాల వయస్సులో పని చేయడం ప్రారంభించినట్లయితే, 40 సంవత్సరాల తర్వాత అంటే 60 ఏళ్లలో రిటైర్మెంట్‌ సమయంలో రూ. 86 లక్షలు పొందుతాడు. మీ జీతం సక్రమంగా ఉంటే మీరు PF విత్‌ డ్రా గురించి ఆలోచించకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories