Car Insurance: వరదల కారణంగా పాడైన కార్లకి ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా.. పూర్తి వివరాలు..!

Is Insurance Applicable for Cars Damaged Due to Floods Know Complete Details
x

Car Insurance: వరదల కారణంగా పాడైన కార్లకి ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా.. పూర్తి వివరాలు..!

Highlights

Car Insurance: వర్షాకాలంలో వరదల వల్ల చాలా ఆస్తినష్టం జరుగుతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో తెలియదు కాబట్టి విలువైన వస్తువులకి ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఉత్తమం.

Car Insurance: వర్షాకాలంలో వరదల వల్ల చాలా ఆస్తినష్టం జరుగుతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో తెలియదు కాబట్టి విలువైన వస్తువులకి ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో వరదల కారణంగా వాహనాలు నిలిచిపోయిన వీడియోలు, ఫొటోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వరదలో కారు-బైక్ పాడైపోయినట్లయితే బీమాను క్లెయిమ్ చేయవచ్చో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ

వాస్తవానికి కారు-బైక్ బీమా క్లెయిమ్ చేసే ముందు బీమా ఏజెంట్‌ను సంప్రదించాలి . ప్రకృతి వైపరీత్యాలలో దెబ్బతిన్న వాహనాలకు బీమా కంపెనీ కవరేజీని ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. నిజానికి వరదలు, భూకంపాలు వంటి విపత్తుల వల్ల కలిగే నష్టాలను తిరిగి పొందేందుకు సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయం చేస్తుంది. ప్రమాదవశాత్తు నష్టం, అగ్ని ప్రమాదం, దొంగతనం వంటి అన్ని రకాల నష్టాలని ఈ పాలసీ కవర్ చేస్తుంది. వరద నష్టం జరిగినప్పుడు ఇంజిన్ లేదా గేర్‌బాక్స్ వంటి నష్టాలకు మాత్రం ఈ పాలసీ కవరేజీని అందించదు.

ఇంజిన్ రక్షణ కవర్

సమగ్ర కారు భీమా పాలసీ అనేది కారు ఇంజిన్‌కు కలిగే నష్టానికి కవరేజీని అందించదు. అయితే ఇందుకోసం ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవాలి. దీనివల్ల కారు-బైక్ డ్యామేజ్ అయిన ఇంజన్ భాగాలను రిపేర్ చేయడానికి లేదా రీప్లేస్‌మెంట్ కోసం క్లెయిమ్ చేయవచ్చు.

నో క్లెయిమ్ బోనస్ (NCB) రక్షణ కవర్

మీలో చాలా మందికి నో క్లెయిమ్ బోనస్ గురించి తెలియదు. కానీ ఈ పాలసీ ప్రకారం మీరు పాలసీని పొందిన తర్వాత ఒకే క్లెయిమ్ తీసుకున్నట్లయితే NCB ప్రయోజనం పొందలేరు. ఈ పరిస్థితిలో NCB రక్షణ కవర్‌ తీసుకుంటే క్లెయిమ్ చేయవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు ఎటువంటి క్లెయిమ్ తీసుకోకుంటే 50 శాతం వరకు తగ్గింపు పొందుతారు.

ఇన్‌వాయిస్ కవర్‌

కారు వరదల కారణంగా మరమ్మత్తు చేయలేని విధంగా దెబ్బతిన్నట్లయితే ఇన్‌వాయిస్ కవర్‌కు తిరిగి వెళ్లడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కవర్ ఉంటే కొనుగోలు చేసిన కారు ధర లేదా కారు ఇన్‌వాయిస్ ధరను క్లెయిమ్ చేయవచ్చు. వాహన రిజిస్ట్రేషన్‌, రోడ్డు పన్ను ఖర్చు కూడా ఇందులోనే ఉంటుంది. ఇది మీ పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని గమనించండి. కాబట్టి కారు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడల్లా ఆ పాలసీ కవరేజీకి సంబంధించిన నిబంధనలు, షరతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories