LIC Best Policy: ఎల్‌ఐసీ బెస్ట్‌ పాలసీ.. సులువుగా రూ.48 లక్షలు మీవే..!

Invest Rs.2000 per Month in LIC Policy and Earn Rs.48 Lakhs
x

LIC Best Policy: ఎల్‌ఐసీ బెస్ట్‌ పాలసీ.. సులువుగా రూ.48 లక్షలు మీవే..!

Highlights

LIC Best Policy: చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ్య రాబడి ఇచ్చే పెట్టుబడుల కోసం వెతుకుతుంటారు.

LIC Best Policy: చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ్య రాబడి ఇచ్చే పెట్టుబడుల కోసం వెతుకుతుంటారు. కానీ ఇది అంత సులభం కాదు. అయితే దీర్ఘకాలికంగా మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) మంచి లాభాలని అందించగలదు. ఎల్‌ఐసీ ఎండోమెంట్ ప్లాన్ నంబర్ 914 ప్లాన్ దీనికి బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఇందులో ప్రతి నెలా రూ.2 వేలు డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీపై రూ.48 లక్షల వరకు పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్ ప్లాన్ 914 సాధారణ ప్రీమియం చెల్లింపు విధానం. అంటే పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకుంటారో అన్నిటికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీలో రెండు రకాల ప్రయోజనాలు అందిస్తారు. మొదటిది వెస్టెడ్ సింపుల్ రివిజన్ బోనస్, రెండవది చివరి అదనపు బోనస్. ఈ రెండు బోనస్‌లు మెచ్యూరిటీ సమయంలో కస్టమర్‌లకు అందిస్తారు. ఈ పాలసీని కనిష్టంగా 8 సంవత్సరాలు గరిష్టంగా 55 సంవత్సరాల వయస్సు వరకు తీసుకోవచ్చు.

పాలసీ ప్రయోజనాలు

ఉదాహరణకి 35 ఏళ్ల రవి పాలసీ నంబర్ 914లో భాగంగా 5 లక్షల బీమా తీసుకున్నాడని అనుకుందాం. ప్రీమియం చెల్లించే కాలం 35 సంవత్సరాలు. రవి ప్రతి నెలా రూ.1186 లేదా సంవత్సరానికి రూ.13923 డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా అతడు మొత్తం రూ.4,87,612 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత పాలసీ మెచ్యూర్ అవుతుంది. రవికి హామీ మొత్తంగా రూ.5 లక్షలు, వెస్టెడ్ సింపుల్ రివిజనరీ బోనస్‌గా రూ.8.40 లక్షలు, చివరి అదనపు బోనస్‌గా రూ.11.50 లక్షలు అందుతాయి. ఈ విధంగా మొత్తం రూ.24.90 లక్షలు అందుతాయి.

అదేవిధంగా ఒక వ్యక్తి 18 ఏళ్ల వయస్సులో ప్లాన్ నంబర్ 914 ప్రారంభిస్తే అతనికి రూ.10 లక్షల బీమా లభిస్తుంది. ప్రీమియం చెల్లించడానికి 35 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ప్లాన్ ధర సంవత్సరానికి రూ.24391 ఉంటుంది. అంటే ప్రతి నెలా రూ.2079 ప్రీమియం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ మొత్తంగా రూ.48 లక్షల 40 వేలు పొందుతాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories