LIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు మీవే..!

Invest Rs 100 Per Day in LIC Jeevan Tarun Policy for Children Get Rs 20 Lakh on Maturity
x

LIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు మీవే..!

Highlights

LIC Policy: పిల్లలు పుట్టడంతో తల్లిదండ్రులకి బాధ్యత మొదలవుతుంది. ఈ పరిస్థితిలో బిడ్డ పుట్టిన వెంటనే ఆర్థిక ప్రణాళిక వేయడం చాలా ముఖ్యం.

LIC Policy: పిల్లలు పుట్టడంతో తల్లిదండ్రులకి బాధ్యత మొదలవుతుంది. ఈ పరిస్థితిలో బిడ్డ పుట్టిన వెంటనే ఆర్థిక ప్రణాళిక వేయడం చాలా ముఖ్యం. దీంతో పిల్లల చదువులు, పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురికాకుండా ఉంటారు. ఇందుకోసం ఎల్‌ఐసీ గొప్ప పాలసీని అందిస్తోంది. దీనిపేరు ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పిల్లలు, వారి తల్లిదండ్రుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీని రూపొందించింది. ఇది నాన్-లింక్డ్ పాలసీ, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ప్లాన్. ఇందులో పిల్లలు పొదుపు, బీమా రక్షణ రెండింటి ప్రయోజనాన్ని పొందుతారు. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులను మీరే భరించే విధంగా దీన్ని తయారుచేశారు.

ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల కనీస వయస్సు 90 రోజుల మధ్య ఉంటుంది. అంటే 3 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ ఇంట్లో ఈ వయస్సు పిల్లలు ఉన్నట్లయితే వెంటనే వారికోసం ప్రణాళికను రూపొందించండి. మీరు ఈ పాలసీని బిడ్డ పుట్టిన 90 రోజుల తర్వాత కొనుగోలు చేసినట్లయితే ప్రతి రోజు మీరు పిల్లలకి 20 ఏళ్లు వచ్చే వరకు దాదాపు రూ. 100, పెట్టుబడి పెడితే చాలు.

సుమారు 20 లక్షల ఫండ్‌ను క్రియేట్‌ చేయవచ్చు. పిల్లలకి 25 ఏళ్లు నిండిన తర్వాత ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి మీరు వార్షికంగా, ప్రతి మూడు నెలలు, 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియంను ఎంచుకోవచ్చు. నెలవారీగా ప్రీమియం చెల్లింపులు చేయడానికి మీకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories