Diwali 2021: దీపావ‌ళి బోన‌స్‌ని ఇక్క‌డ పెట్టుబ‌డి పెట్టండి.. అధిక రాబ‌డి పొందండి..

Invest Diwali Bonus Fixed Deposit FD Gold Mutual Funds get High Profits
x

దీపావ‌ళి బోన‌స్‌ని ఇక్క‌డ పెట్టుబ‌డి పెట్టండి (ఫైల్ ఇమేజ్)

Highlights

Diwali 2021: దీపావ‌ళికి దాదాపు ఉద్యోగులంద‌రు బోన‌స్ పొందుతారు. వీటిని పండుగ ఖ‌ర్చుల‌కు, షాపింగ్ వంటి వాటికి ఉప‌యోగిస్తారు

Diwali 2021: దీపావ‌ళికి దాదాపు ఉద్యోగులంద‌రు బోన‌స్ పొందుతారు. వీటిని పండుగ ఖ‌ర్చుల‌కు, షాపింగ్ వంటి వాటికి ఉప‌యోగిస్తారు. అలా కాకుండా ఈ డ‌బ్బుల‌ను కొన్నింటిలో పెట్టుబ‌డి పెడితే దీర్ఘ‌కాలికంగా మంచి లాభాలు పొంద‌వ‌చ్చు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలా చేస్తే ఇది భారీ ఫండ్ త‌యార‌వుతుంది. మీ ఉద్యోగ విరమణ, పిల్లల చదువు, వివాహం వంటి వాటికి మీకు స‌హాయ‌ప‌డుతుంది. అందుకే సంపదను ఉత్పత్తి చేసే ఆస్తులలో మీ బోనస్‌ను పెట్టుబడి పెట్టడం మంచిది. అలాంటివి కొన్ని తెలుసుకుందాం.

>> ఫిక్స్‌డ్ డిపాజిట్

మీకు రిస్క్ వ‌ద్ద‌నుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ మీకు ఉత్తమమైన ఎంపిక. ప్రస్తుతం బ్యాంకులు దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 నుంచి 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే మీరు మీ బోనస్‌ని FDలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు, బ్యాంకులు , పోస్టాఫీసులు అందించే వడ్డీ రేట్లను తెలుసుకోవ‌డం మంచిది.

>> మ్యూచువల్ ఫండ్స్

మార్కెట్ ఒడిదొడుకుల‌ను త‌ట్టుకునే శ‌క్తి మీకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు ఉత్త‌మ ఎంపిక‌. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. అయితే ఈక్విటీ MF పథకాలు చాలా కాలం పాటు ద్రవ్యోల్బణ-బీటింగ్ రాబడులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మీరు దీర్ఘకాలిక లక్ష్యం కోసం పొదుపు చేస్తుంటే మీరు మీ దీపావళి బోనస్‌ను ఈక్విటీ MF పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్

పండుగ సీజన్‌లో ముఖ్యంగా ధన్తేరస్ సమయంలో ప్రజలు బంగారు నాణేలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. అయితే పెట్టుబడి కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే బంగారం కొనే బదులు సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్ జీబీ)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. లావాదేవీపై సున్నా లావాదేవీ ఛార్జీలు ఉన్నందున SGBని కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు పెట్టుబడి మొత్తంపై 2.5 శాతం వడ్డీని పొందుతారు. మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌లో కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories