ఈపీఎఫ్‌, సుకన్య యోజన ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్‌.. వీటిలో ఎటువంటి మార్పు లేదు..!

Interest Rates on Small Saving Schemes Have not Increased
x

ఈపీఎఫ్‌, సుకన్య యోజన ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్‌.. వీటిలో ఎటువంటి మార్పు లేదు..!

Highlights

EPFO SSY: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈపీఎఫ్‌ పై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించారు.

EPFO SSY: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈపీఎఫ్‌ పై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించారు. ఇది 43 సంవత్సరాలలో అతి తక్కువ ఈపీఎఫ్‌ రేటు. ఇది ఈపీఎఫ్‌లో డబ్బునిఇన్వెస్ట్ చేసేవారిని షాక్‌కు గురి చేసింది. ఇప్పుడు ఆర్భీఐ రెపో రేటును 0.90 శాతం పెంచినప్పటికీ జూలై నుంచి సెప్టెంబర్ వరకు 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచలేదు.

ఈపీఎఫ్‌వో బోర్డు ఈపీఎఫ్‌ పై వడ్డీ రేటును తగ్గించినప్పుడు విమర్శలకి గురైంది. తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ తన ఫ్యాక్ట్‌షీట్‌లో 2021-22కి ఈపీఎఫ్‌ రేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించారని తెలిపింది. రెపో రేటు పెరుగుదల కారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ ప్రభుత్వం పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచుతారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవలేదు. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర నిరాశకి గురయ్యారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

1. ఉద్యోగుల భవిష్య నిధి(EPF)-8.1%

2. సుకన్య సమృద్ధి యోజన(SSY)-7.6%

3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS)-7.4%

4. పీపీఎఫ్‌ -7.1%

5. కిసాన్ వికాస్ పత్ర(KVP)-6.9%

6. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్.(8%)

7. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా(POSB)-4%

ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ వంటి పొదుపు పథకాలు సీనియర్ సిటజన్లకి మంచి రాబడి తీసుకొచ్చే పథకాలు. ఇప్పుడు ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోయింది. ఆహార పదార్థాల నుంచి పెట్రోల్‌ డీజిల్‌ వరకు, వంటగ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇతర వస్తువులు కూడా ఖరీదైనవిగా మారాయి. ఈఎంఐ కూడా ఖరీదైనదిగా మారింది. సహజంగానే ఇది పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారి జేబులపై ప్రభావం చూపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories