10 Rupee Coin: 10 రూపాయల కాయిన్‌పై ఇండియన్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన..!

10 Rupee Coin
x

10 Rupee Coin: 10 రూపాయల కాయిన్‌పై ఇండియన్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన..!

Highlights

Rs 10 Coin: 10 రూపాయల నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని రోజువారి లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

Rs 10 Coin: 10 రూపాయల నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని రోజువారి లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 10 రూపాయల నాణేల చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని, ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ చర్యలు చేపడుతోందని వివరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద 10 రూపాయల నాణేల చలామణి‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయన్నారు. కాగా ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో రూ. 10 నాణేంపై జరుగుతోన్న అపోహలకు చెక్‌ పెట్టినట్లు అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పటికీ చాలా మంది రూ. 10 నాణేలను తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ఈ కాయిన్స్ చెల్లవన్న అనుమానంతో తీసుకోవడం లేదు. ఈ కారణంగా ఈ నాణేల రొటేషన్ మార్కెట్లో భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే కాయిన్స్ పై అవగాహన పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories