PF Alert: పీఎఫ్ అలర్ట్‌.. ఇలాంటి సమయంలో మనీ విత్‌డ్రా చాలా నష్టం..!

If you withdraw PF money after quitting your job you will lose a lot
x

PF Alert: పీఎఫ్ అలర్ట్‌.. ఇలాంటి సమయంలో మనీ విత్‌డ్రా చాలా నష్టం..!

Highlights

PF Alert: పీఎఫ్ అలర్ట్‌.. ఇలాంటి సమయంలో మనీ విత్‌డ్రా చాలా నష్టం..!

PF Alert: చాలా సార్లు కొంతమంది ఉద్యోగులు తమకు తెలియకుండానే వచ్చే ప్రయోజనాలని కోల్పోతారు. కొన్నిసార్లు ఉద్యోగం మానేసిన తర్వాత వెంటనే పీఎఫ్ ఖాతా నుంచి పూర్తి డబ్బును విత్‌డ్రా చేస్తారు. దీని కారణంగా మీ పొదుపు మొత్తం ఖర్చు చేయడమే కాకుండా అనేక విధాలుగా నష్టపోతారు. మీకు డబ్బు అవసరమైతే ఆ అవసరాన్ని వేరే విధంగా తీర్చుకోవడానికి ప్రయత్నించండి. కానీ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయకుండా ఉండండి. ఎందుకో పూర్తిగా తెలుసుకుందాం.

మీరు ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా పీఎఫ్ పై వడ్డీ పొందుతూనే ఉంటారు. అంతేకాదు బ్యాంకు ఎఫ్‌డీ, ఇతర డిపాజిట్ పథకాల కంటే పీఎఫ్ వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది. ఇది కాకుండా మీరు పీఎఫ్ డబ్బును విత్‌ డ్రా చేస్తే పెన్షన్‌కి అర్హత సాధించరు. ఇలాంటి సమయంలో కొత్త ఉద్యోగాన్ని పొందిన తర్వాత పాత కంపెనీకి చెందిన పీఎఫ్ మొత్తాన్ని కొత్తదానికి బదిలీ చేయడం మంచిది. ఇది సేవ కొనసాగింపుగా పరిగణిస్తారు. దీనివల్ల పెన్షన్ పథకానికి ఎలాంటి ఆటంకం కలగదు.

రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల వరకు వడ్డీ జమవుతూనే ఉంటుంది.

మీరు రిటైర్మెంట్‌ తర్వాత వెంటనే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని పొందుతారు. తర్వాత అది ఇన్‌యాక్టివ్ ఖాతాగా మారిపోతుంది. పీఎఫ్ మొత్తం మీకు మెరుగైన పొదుపు రూపంలో మాత్రమే కాకుండా పన్ను రహితంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ ఎంపిక. అయితే మీరు 5 సంవత్సరాలలోపు PF విత్‌డ్రా చేసుకుంటే దానిపై పన్ను విధిస్తారు. దీన్ని చాలా కాలం పాటు అమలు చేయడానికి ప్రయత్నించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories