Post Office MIS Scheme: నెల నెలా ఫ్రీగా మీ అకౌంట్లో 5వేలు జమ కావాలంటే..ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఎలా అందుకోవాలో తెలుసుకోండి

Post Office MIS Scheme:  నెల నెలా ఫ్రీగా మీ అకౌంట్లో 5వేలు జమ కావాలంటే..ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఎలా అందుకోవాలో తెలుసుకోండి
x
Highlights

Post Office MIS Scheme: నేటికాలంలో ఆర్థిక అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్థిక అవసరాలకు అనుగుణంగానే ఆదాయం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ,...

Post Office MIS Scheme: నేటికాలంలో ఆర్థిక అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్థిక అవసరాలకు అనుగుణంగానే ఆదాయం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం నెలనెలా కొంత డబ్బు పొందడం కోసం పోస్టాఫీస్ లో కొన్ని మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కొంతమంది పెట్టుబడిపై ఎక్కువ వడ్డీ రావాలని కోరుకుంటారు. ఇంకొంతమంది నెలలవారీ ఆదాయం వచ్చే పథకంలో డబ్బును పెట్టుబడి పెడుతుంటారు. పోస్టాఫీసులో అన్ని రకాల పెట్టుబడుల కోసం స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసులో పెట్టుబడి డబ్బు పూర్తిగా సురక్షితమైంది. ఎందుకంటే ఇందులో హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.

రిటైర్మెంట్ తర్వాత నెలలవారీ ఆదాయం అనేది ఆగిపోతుంది. చాలా మంది సాధారణ ఆదాయాన్ని అందించే స్కీమ్స్ కోసం చూస్తుంటారు. పోస్టాఫీస్ నెలలవారీ ఇన్కమ్ ప్లాన్ వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఒకసారి పెట్టుబడి పెట్టాలి. అప్పటి నుంచి వడ్డీ మొత్తం ప్రతినెలా వస్తుంది. రిటైర్మెంట్ చేసిన వారే కాదు డబ్బు అవసరం ఉన్నవారు సాధారణ ఆదాయం కోరుకునే వారు కూడా ఈ స్కీములో ఇన్వెస్ట్ చేయవచ్చు.

పోస్టాఫీస్ వెబ్ సైట్లో అందించిన వివరాల ప్రకారం నెలలవారీ 7.4శాతం వడ్డీని చెల్లిస్తుంది. స్కీములో అకౌంట్ తెరచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత వడ్డీ ప్రారంభం అవుతుంది. అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నెల నుంచి రెగ్యులర్ ఆదాయం వస్తుంది. కనీస పెట్టుబడి రూ. 1000 పెట్టాల్సి ఉంటుంది. పోస్టాఫీసు నెలలవారీ ఆదాయ స్కీములో సింగిల్, జాయింట్ అకౌంట్స్ ను కూడా తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ. 1000 ఉంటుంది. ఒకే అకౌంట్లో గరిష్టంగా రూ. 9లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో గరిష్ట పెట్టుబడి మొత్తం 15లక్షలు ఉంటుంది.

నెలలవారీ ఖాతా ప్లానులో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేయాలి. 18ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఎవరైనా ఈ స్కీములో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా పోస్టాఫీసు నెలలవారీ ఆదాయం స్కీములో 8లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే అతనికి ప్రతినెల ఎంత డబ్బు వస్తుందనేది MIS కాలిక్యూలేటర్ ప్రకారం 7.4శాతం వడ్డీ రేటుతో రూ. 8లక్షల పెట్టుబడి నెలకు రూ. 4,933 పొందుతారు.

MIS వ్యవధి ఐదేళ్లు అంటే వినియోగదారుడు ఐదేళ్లపాటు ఈ ఆదాయాన్ని పొందుతారు. ఆ తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ పెట్టుబడి ఒక ఏడాది తర్వాత ఖాతా తెరిచిన తేదీ నుంచి 3ఏళ్ల లోపు డబ్బు విత్ డ్రా చేసుకుంటే మూలధనం నుంచి 2శాతం మొత్తం తీసేస్తారు. 3ఏళ్ల తర్వాత, 5ఏళ్ల ముందు డబ్బును విత్ డ్రా చేసినట్లయితే పెట్టుబడిలో 1శాతం మినహాయింపు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories