Millionaire: కోటీశ్వరుడు కావాలంటే ఈ 5 విషయాలు అస్సలు మరిచిపోకండి..!

If you Want to be a Millionaire do not Forget These 5 Things at All
x

Millionaire: కోటీశ్వరుడు కావాలంటే ఈ 5 విషయాలు అస్సలు మరిచిపోకండి..! 

Highlights

Millionaire: ప్రతి ఒక్కరు జీవితంలో చాలా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని కలలు కంటారు.

Millionaire: ప్రతి ఒక్కరు జీవితంలో చాలా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని కలలు కంటారు. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే కొన్ని పద్దతులని కొంతమంది మాత్రమే అనుసరించగలరు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు లేదా పెట్టుబడి చేయడం అలవాటు చేసుకుంటే 45 ఏళ్లు వచ్చే సరికి కోటీశ్వరుడు కావొచ్చు. కానీ క్రమశిక్షణతో పెట్టుబడి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. అప్పులు ఉండకూడదు

డబ్బు సంపాదించాలంటే ముందుగా మనకి అప్పు ఉండకూడదు. ఎందుకంటే అప్పు అనేది మనిషిని ఎదగనివ్వదు. మీరు జాబ్ చేసినా లేదా వ్యాపారం చేసినా అప్పులు ఉంటే వెంటనే తీర్చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అప్పులను ఆలస్యం చేస్తే అవి ఒక కొండలా, బండలా మారిపోతాయి. అప్పును తీర్చిన తర్వాత పొదుపు చేస్తే అప్పుడు మీరు అనుకున్న లక్ష్యంవైపు వెళ్లవచ్చు.

2. పెట్టుబడే మంచి ఎంపిక

పొదుపు చేస్తే బ్యాంకు ఎఫ్డీ, సేవింగ్ ఖాతాల్లో వచ్చే వడ్డీ తక్కువగా ఉంటుంది. అదే పెట్టుబడి చేస్తే మీరు పెద్ద మొత్తంలో రాబడిని పొందుతారు. అయితే సరైన పెట్టుబడి పద్దతులని ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ మంది ఇన్వెస్ట్ మెంట్ వాయిదా వేస్తూ ఉంటారు. జీతం అరకొరగా ఉందని అనుకుంటారు. కానీ ఎంత చిన్న మొత్తం అని ఆలోచించకూడదు. ఎన్ని రోజులు కొనసాగించామనేదే ముఖ్యం.

3. ఎమర్జెన్సీ ఫండ్‌

అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బు మన దగ్గర మెయింటెన్‌ చేయాలి. భవిష్యత్ లేదా రిటైర్మెంట్ కోసం కాదు ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏం చేయాలో తోచదు. అలాంటి పరిస్థితులని ఎదుర్కొడానికి ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి.

4. హెల్త్‌ ఇన్సూరెన్స్‌

కరోనా వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి అయింది. నేటి రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు భరించాలంటే తలకి మించిన భారంగా మారుతోంది. అందుకే ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. అనారోగ్యం ఏర్పడినప్పుడు పెట్టుబడులకు ఎలాంటి అవరోధాలు కల్గకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.

5. అనవసర ఖర్చులు వద్దు

డబ్బు సంపాదించాలంటే అనవసర ఖర్చులకి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకుని డబ్బును ఆదా చేసేందుకు ప్రయత్నించాలి. ముఖ్యమైనది అయితేనే డబ్బు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇలా కచ్చితంగా ఒక ప్రణాళక ప్రకారం ప్లాన్‌ చేస్తే ఎవ్వరైనా కోటీశ్వరులు కావొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories