మీరు ఈ వ్యాపారం ప్రారంభిస్తే లక్షల్లో సంపాదిస్తారు.. కానీ కచ్చితంగా ఇవి తెలుసుకోవాలి..!

If You Start a Restaurant Business you Will Earn Millions but you Must Know Certain Things
x

మీరు ఈ వ్యాపారం ప్రారంభిస్తే లక్షల్లో సంపాదిస్తారు.. కానీ కచ్చితంగా ఇవి తెలుసుకోవాలి..!

Highlights

Business Idea: ప్రజలు డబ్బు సంపాదించడానికి రకరకాల వ్యాపారం చేస్తారు.

Business Idea: ప్రజలు డబ్బు సంపాదించడానికి రకరకాల వ్యాపారం చేస్తారు. ఇందులో లాభనష్టాలు అనేవి రెండూ ఉంటాయి. అయితే ఇది మీరు చేస్తున్న వ్యాపారం అది ఎలా చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజుల్లో రెస్టారెంట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నెలకి సులువుగా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే ఈ బిజినెస్‌ ఎలా చేయాలి.. పరిమితులు ఏంటి తదితర విషయాలు తెలుసుకుందాం.

ప్రాంతాన్ని నిర్ణయించండి

మీరు రెస్టారెంట్‌ను ప్రారంభించే ప్రదేశం చాలా ముఖ్యమైనది. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో రెస్టారెంట్‌ను ఓపెన్‌ చేయాలి. అంతేకాదు ఇది అందరికి అందుబాటులో ఉండే సెంటర్‌లో ఉండాలి.

మెనుని సిద్ధం చేయండి

మీరు రెస్టారెంట్‌ను ప్రారంభించేటప్పుడు ఆహార పదార్థాల మెనుని సిద్ధం చేయాలి. అలాగే రెస్టారెంట్ ఉన్న ప్రదేశాన్ని గుర్తుంచుకొని అక్కడ ఏ తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు అనే వాటిని పరిగణలోనికి తీసుకొని మెను తయారుచేయాలి. వారికి నచ్చే ఐటమ్స్‌ తయారుచేసే విధంగా ఉండాలి. అప్పుడే బిజినెస్‌ బాగా జరుగుతుంది.

ధరను సెట్ చేయండి

లొకేషన్ ప్రకారం, మీ రెస్టారెంట్ అద్దె ప్రకారం ఆహారం ధరని నిర్ణయించండి. మీ ఖరీదు తక్కువగా లాభం వచ్చే విధంగా ఆహార ధరలను నిర్ణయించాలి.

లైసెన్స్ తీసుకోండి

మీరు రెస్టారెంట్ నడుపుతున్నట్లయితే దాని లైసెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. రెస్టారెంట్‌ను నడుపుతున్న భవనం లేదా ప్రాంతానికి లైసెన్స్ అవసరం. ఈ సందర్భంలో మొదట లైసెన్స్ తీసుకొని ఇవన్నీ చేయడం ఉత్తమం.

మార్కెటింగ్ చేయండి

మీ వ్యాపారాన్ని బాగా మార్కెటింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనం లభిస్తుంది. ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేస్తే ప్రజల దృష్టిలో మీ పేరు అంత ఎక్కువగా వినిపిస్తుంది.

చెఫ్‌లు, వెయిటర్లు మధ్య సమన్వయం

మీరు చెఫ్‌లు , వెయిటర్‌లను నియమించుకున్నట్లయితే వారి మధ్య మెరుగైన సమన్వయం అవసరం. ఆహార పరిశుభ్రత, మంచి కస్టమర్ సేవను అందించవచ్చు. దీని కారణంగా ప్రజలు మీ రెస్టారెంట్‌కి మళ్లీ మళ్లీ వస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories