Credit Score: లోన్​ తీసుకోకుంటే క్రెడిట్​ స్కోరు ఉండదు.. కానీ ఈ విషయాలు చెక్​ చేయాల్సిందే..!

If You Dont Take A Loan You Think That You Dont Need a Credit Score But You Need To Know These Things
x

Credit Score: లోన్​ తీసుకోకుంటే క్రెడిట్​ స్కోరు ఉండదు.. కానీ ఈ విషయాలు చెక్​ చేయాల్సిందే..!

Highlights

Credit Score: మీకు అర్జంట్​గా లోన్​ అవసరమైతే బ్యాంకుకు వెళ్లడం కాదు ముందుగా మీ క్రెడిట్​ స్కోరు ఎంతో తెలుసుకోవాలి.

Credit Score: మీకు అర్జంట్​గా లోన్​ అవసరమైతే బ్యాంకుకు వెళ్లడం కాదు ముందుగా మీ క్రెడిట్​ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఫైనాన్షియల్​ సంస్థ అయినా సరే మీ క్రెడిట్​ స్కోరు చెక్​ చేసిన తర్వాతనే లోన్​ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. అయితే కొంతమంది తాము ఏ లోన్​ తీసుకోము తమకు క్రెడిట్​ స్కోరు గురించి అవసరం లేదనుకుంటారు. ఇలా ఆలోచిస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్​ స్కోరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అది ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి మీకు లోన్లు తీసుకునే అవసరం లేదా కావొచ్చు కానీ జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు. బ్యాచిలర్​గా ఉన్నప్పుడు మీకు ఏ అవసరం ఉండదు కానీ మ్యారేజ్​ అయిన తర్వాత ప్రయారిటీస్​ మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఎంచుకున్న లక్ష్యాల కోసం లోన్లు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ఉదాహారణకు ఇళ్లు కొనడం, వెహికల్​ తీసుకోవడం, స్టడీ లోన్​ ఇలాంటివి అవసరమవుతాయి. అప్పుడు మీకు కచ్చితంగా క్రెడిట్​ స్కోరు 750 పైనే ఉండాలి.

లేదంటే అధిక వడ్డీలకు లోన్లు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. మీరు సొంతంగా క్రెడిట్‌ స్కోరును చెక్​ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ బ్యాంకులు, ఫైనాన్షియల్​ సంస్థలు మీ స్కోరును చెక్​ చేస్తే లోన్​ కోసం అప్లై చేసినట్లు అవుతుంది. దీనివల్ల క్రెడిట్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందని గుర్తుంచుకోండి.

నిజానికి లోన్​ తీసుకోకుంటే మీకు ఎలాంటి క్రెడిట్​ స్కోరు ఉండదు. కానీ పెరిగిన టెక్నాలజీ వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ పేరుపై లోన్లు, అప్పులు నమోదవుతాయి. ఎందుకంటే సైబర్​ నేరగాళ్లు అవకాశం కోసం ఎప్పుడు ఎదురుచూస్తే ఉంటారు. అందుకే అప్పుడప్పుడు క్రెడిట్​ స్కోరు చెక్​ చేస్తూ ఉండాలి.

దీనివల్ల మీ పేరుపై ఏమైనా లోన్లు ఉన్నాయా లేదా తెలుస్తుంది. మీ క్రెడిట్​ స్కోరు పెరిగిందా లేదా అనే విషయాలు గమనించవచ్చు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి క్రెడిట్​ స్కోరు అనేది మీరు ఈఎంఐ లాంటి ఒక ఇన్​స్టాల్​మెంట్​ లేట్​గా కట్టిన వంద పాయింట్లు పడిపోతుంది. అదే వంద పాయింట్లను పెంచుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అది సంవత్సరాలలో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories