PF Money: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయడం సమస్యగా మారిందా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

If there is a problem in withdrawing PF money one can complain
x

PF Money: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయడం సమస్యగా మారిందా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

Highlights

PF Money: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయడం సమస్యగా మారిందా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

PF Money: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (EPFO) అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది ఉద్యోగుల భద్రత కోసం ఏర్పడింది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఈ కరోనా సమయంలో కొంతమంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డున పడ్డారు. పీఎఫ్ డబ్బుల కోసం అప్లై చేసుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం చేతికి అందడం లేదు. దీంతో ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన కార్మిక మంత్రిత్వ శాఖ ఏం చేయాలో వివరించింది. దాని గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి కస్టమర్ ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ ద్వారా షేర్ చేశాడు. 'చాలా నెలలుగా నేను నా PF డబ్బును క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల పీఎఫ్ క్లెయిమ్‌ను పదే పదే తిరస్కరిస్తున్నారు. నేను ఒక నిరుద్యోగిని డబ్బు చాలా అవసరం. దయచేసి స్పందించండి' అని వేడుకున్నాడు. ఈ ఫిర్యాదుపై కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్పందించింది. కస్టమర్ ట్వీట్‌పై స్పందిస్తూ మీ పీఎఫ్ డబ్బుల కోసం మరింత ఆలస్యం అయితే https://epfigms.gov.in ని సందర్శించి ఫిర్యాదు చేయండని తెలిపింది. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.

మీరు PF డబ్బును విత్‌డ్రా చేయడంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే EPFIGMS పోర్టల్‌తో పాటు WhatsApp హెల్ప్‌లైన్ సేవ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా పీఎఫ్ సంస్థ కూడా కరోనా కాలంలో ఉద్యోగుల డబ్బులను వెంటనే చెల్లిస్తుంది. ప్రాసెస్‌ కూడా త్వరగా కంప్లీట్ చేస్తున్నామని చెబుతుంది. కానీ సరైన వివరాలు లేని ఖాతాదారుల డబ్బులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం సూచించాల్సి ఉంటుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories