Bill Date: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడంలో లేట్ అయ్యారా.. పెనాల్టీలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఇదిగో ఫార్ములా...!

If The Credit Card Bill Is Not Paid On Time A Heavy Penalty Is Also Imposed
x

Bill Date: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడంలో లేట్ అయ్యారా.. పెనాల్టీలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఇదిగో ఫార్ములా...!

Highlights

Credit Card Bill Pay: క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే, జరిమానా కూడా విధిస్తుంటారు. ఈ పెనాల్టీ మీ జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో, క్రెడిట్ కార్డులను ఉపయోగించే వ్యక్తులు క్రెడిట్ కార్డ్ ఛార్జీలు మొదలైన వాటి గురించి కూడా తెలుసుకోవాలి.

Credit Card : ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు క్రెడిట్ కార్డుల ద్వారా చాలా చెల్లింపు సౌకర్యాన్ని పొందుతుండడంతో సులభంగా చెల్లింపులు చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌లను వాడుకొని చేసిన చెల్లింపులను బిల్లుల రూపంలో చెల్లిస్తుంటారు. అయితే, వీటికి కొంత సమయం ఉంటుంది. నిర్ణీత గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే మాత్రం జేబులకు చిల్లులు పడ్డట్లే.

సకాలంలో చెల్లింపులు చేయకుంటే..

క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే, జరిమానా కూడా విధిస్తుంటారు. ఈ పెనాల్టీ మీ జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో, క్రెడిట్ కార్డులను ఉపయోగించే వ్యక్తులు క్రెడిట్ కార్డ్ ఛార్జీలు మొదలైన వాటి గురించి కూడా తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి 20 రోజుల నుంచి 50 రోజుల సమయం ఇస్తుంటాయి. ఈ వ్యవధిలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తే పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఈ వ్యవధిలో కూడా చెల్లింపు చేయకపోతే, అప్పుడు ఛార్జీ విధించబడుతుంది. వడ్డీ కూడా పెరుగుతుంది.

ఆలస్యంగా చెల్లింపులు..

బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ మీ బకాయిపై ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటును లెక్కిస్తారు. అయితే, వడ్డీ రేటు వార్షిక APR (వార్షిక శాతం రేటు) రూపంలో పేర్కొనబడింది. ఇక్కడ రేటు 14% నుంచి 40% మధ్య ఉండవచ్చు. కాబట్టి, మీరు క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించడంలో విఫలమైనప్పుడు, బకాయి ఉన్న ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ పెరుగుతుంది. ఈ వడ్డీ మీ బ్యాలెన్స్ ప్రకారం నిర్ణయిస్తుంటారు. అలాగే గడువు తేదీకి మించిన నాటి నుంచి కూడా లెక్కిస్తుంటారు.

ఇది ఫార్ములా..

మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపును ఎంత ఆలస్యం చేస్తే, వడ్డీ లేదా ఆలస్య రుసుము అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, మీరు చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని చెల్లించినప్పటికీ బ్యాంకు మీకు వడ్డీని వసూలు చేస్తుంది. బ్యాంకులు మీ బకాయి ఖాతాపై రోజువారీ వడ్డీని లెక్కిస్తాయి. ఈ ఫార్ములాలో ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. (లావాదేవీ తేదీ నుంచి మొత్తం రోజులు x బ్యాలెన్స్ x నెలవారీ క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు x 12 నెలలు) / 365 రోజులు.

Show Full Article
Print Article
Next Story
More Stories