UPI Payment: ఐసీఐసీఐ నుంచి ఐడీఎఫ్‌సీ వరకు.. క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ చెల్లింపులు.. రివార్డులే కాదండో మరెన్నో బంఫర్ ఆఫర్లు..!

ICICI to IDFC These Credit Cards offers to make payments Through UPI Payments
x

UPI Payment: ఐసీఐసీఐ నుంచి ఐడీఎఫ్‌సీ వరకు.. క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ చెల్లింపులు.. రివార్డులే కాదండో మరెన్నో బంఫర్ ఆఫర్లు..!

Highlights

UPI Payment Through Credit Card: ICICI బ్యాంక్ ఇటీవల UPI లావాదేవీలతో RuPay క్రెడిట్ కార్డ్‌ను ఏకీకృతం చేసింది.

UPI Payment Through Credit Card: ICICI బ్యాంక్ ఇటీవల UPI లావాదేవీలతో RuPay క్రెడిట్ కార్డ్‌ను ఏకీకృతం చేసింది. వినియోగదారులు ఇప్పుడు దానిని తమకు నచ్చిన UPI యాప్‌కి లింక్ చేసి, ఆపై వ్యక్తి నుండి వ్యాపారి లావాదేవీలను నిర్వహించవచ్చు. ICICI బ్యాంక్ తన రూపే క్రెడిట్ కార్డ్‌లపై UPI లావాదేవీలను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి పనిచేసింది.

ICICI బ్యాంక్ నుంచి రూపే కార్డ్‌లలో కోరల్ రూపే కార్డ్, HPCL సూపర్ సేవర్, రూబిక్స్ ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ హెడ్ బిజిత్ భాస్కర్ మాట్లాడుతూ, 'రుపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో అనుసంధానం చేయడం వల్ల 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్‌ను అందించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన ఆర్థిక లిక్విడిటీని అందిస్తుంది. రూపే క్రెడిట్ కార్డ్‌తో UPIని విలీనం చేయడం ద్వారా మేం డిజిటల్ చెల్లింపుల ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మిస్తున్నామని NPCI తెలిపింది.

ఇతర బ్యాంకులు కూడా..

ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఇతర బ్యాంకులు కూడా రూపే కార్డును యుపిఐతో లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. ఇంతకుముందు, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు చెల్లింపు చేయడానికి కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇంతకంటే తక్కువ చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. కార్డ్ స్వైప్ మెషీన్లు లేని వ్యాపారులు కార్డ్ చెల్లింపులను తీసుకోలేరు. కానీ, ఇప్పుడు వారు UPI QR ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.

కొన్ని ఇతర బ్యాంకుల రూపే కార్డులు:

1. PNB క్రెడిట్ కార్డ్‌..

ఈ కార్డ్‌లో పొందాలంటే రూ.1000లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వార్షిక రుసుము మాత్రం జీరోగా పేర్కొంది. మీరు మొదటి సారి కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా 300+ రివార్డ్ పాయింట్‌లను పొందుతారు.

PNB ఈ కార్డ్‌పై వ్యక్తిగత ప్రమాద కవర్ కూడా అందుబాటులో ఉంది.

యుటిలిటీ బిల్లు, హోటల్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

రిటైల్ వ్యాపారంలో చెల్లింపులు చేస్తే మీరు 2X రివార్డ్ పాయింట్‌లను పొందుతారు.

2. కోటక్ లీగ్ రూపే క్రెడిట్ కార్డ్..

ఈ కార్డ్ జాయినింగ్ ఫీజు రూ. 499లు, అలాగే వార్షిక రుసుము రూ.499తో వస్తుంది. ఒక సంవత్సరంలో రూ. 50 వేలు ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము మాఫీ చేయబడుతుంది. 21 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులు ఎవరైనా ఈ కార్డును తీసుకోవచ్చు. ప్రతి 6 నెలలకు రూ.1.25 లక్షలు ఖర్చు చేసిన తర్వాత 4 PVR సినిమా టిక్కెట్లు ఉచితంగా పొందవచ్చు. ఇంధన లావాదేవీలపై ఒకేసారి గరిష్టంగా రూ.3500 సర్‌ఛార్జ్ వాపసు ఉంటుంది.

3. IDFC ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్‌..

ఈ కార్డ్ జాయినింగ్ ఫీజు రూ.499లు కాగా, వార్షిక రుసుము రూ.499తో వస్తుంది. మీరు ఒక సంవత్సరంలో రూ.150,000 ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము మాఫీ చేయబడుతుంది. ATM నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఒక్కో లావాదేవీకి రూ.199 ఉపసంహరణ రుసుముగా పేర్కొన్నారు. 2 సినిమా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంపై 25% తగ్గింపు (గరిష్టంగా రూ.100) అందుబాటులో ఉంది. వ్యక్తిగత ప్రమాద కవరేజ్ రూ.2 లక్షలు, చివరి కార్డ్ లయబిలిటీ కవర్ రూ.25,000. అలాగే, HPCL, LPG యుటిలిటీ, కిరాణాపై ప్రతి రూ.150 చెల్లింపుపై 30 రివార్డ్ పాయింట్‌లు పొదవచ్చు.

4. IDBI విన్నింగ్ రూపే సెలెక్ట్ కార్డ్..

ఈ కార్డ్‌లో చేరడానికి ఎటువంటి ఫీజులు లేదు. అయితే, వార్షిక రుసుము రూ. 899లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ. 90,000 ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము మాఫీ చేయబడుతుంది. ప్రమాద మరణ రక్షణ, శాశ్వత అంగవైకల్యానికి రూ.10 లక్షల కవరేజీ అందుబాటులో ఉంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులు ఎవరైనా ఈ కార్డును జారీ చేయవచ్చు. ప్రతి రూ.100 చెల్లింపుపై 2 డిలైట్ పాయింట్‌లు, పుట్టినరోజు నెలలో డబుల్ డిలైట్ పాయింట్‌లు అందిస్తారు. ఒక నెలలో రూ.1000 పూర్తి చేస్తే, అలాగే 5 లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా అదనపు 500 డిలైట్ పాయింట్‌లు పొందవచ్చు.

5. HDFC ఫ్రీడమ్ రూపే క్రెడిట్ కార్డ్..

ఈ కార్డ్‌లో చేరడానికి రూ. 500, వార్షిక రుసుము రూ.500లు చెల్లించాల్సి ఉంది. ఒక సంవత్సరంలో రూ.50,000లు ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము మాఫీ చేయబడుతుంది. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులు ఎవరైనా ఈ కార్డును తీసుకోవచ్చు. రూ.400ల నుంచి రూ.5000 వరకు ఇంధన లావాదేవీలపై 1% సర్‌ఛార్జ్ మొత్తం అందుబాటులో ఉంది. Big Basket, Book My Show, Oyo, Swiggyలో ప్రతి రూ.100 చెల్లింపుపై 10X క్యాష్ పాయింట్‌లు వస్తాయి.

భారత్ రూపే కార్డ్ : రూపే కార్డ్‌ను 2011లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. 8 మే 2014న, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతదేశ స్వంత చెల్లింపు కార్డు 'రుపే'ని జాతికి అంకితం చేశారు. దేశంలో చెల్లింపు వ్యవస్థను పెంచడమే దీని లక్ష్యం. దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు రూపే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి.

క్రెడిట్ కార్డ్‌ని UPIకి లింక్ చేసే సదుపాయం..

సెప్టెంబర్ 21న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ UPI నెట్‌వర్క్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించారు. ఇంతకుముందు, డెబిట్ కార్డ్‌లు, ఖాతాలను మాత్రమే UPI నెట్‌వర్క్‌కి లింక్ చేసేవారు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అనే మూడు బ్యాంకుల కార్డులతో ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories