Fixed Deposit: ఈ బ్యాంకు మరోసారి వడ్డీ రేట్లని పెంచింది.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..!

ICICI Bank Raises Interest Rates Once Again What About the New Rates
x

Fixed Deposit: ఈ బ్యాంకు మరోసారి వడ్డీ రేట్లని పెంచింది.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..!

Highlights

Fixed Deposit: ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చుతున్నాయి.

Fixed Deposit: ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. బ్యాంకు వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంకు గత వారమే వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. 2 కోట్ల నుంచి 5 కోట్లకు ఎఫ్‌డి చేసిన ఖాతాదారులకి వడ్డీ రేట్లు పెంచారు. ఈ పెంపుదల 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు. దీంతో పాటు ఈ కొత్త రేట్లు 21 ఏప్రిల్ 2022 నుండి అమలు అవుతున్నాయి.

బ్యాంకు 1 నుంచి 15 నెలల వరకు FDలపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇంతకుముందు ఈ కాలానికి చెందిన ఎఫ్‌డిలపై 4.25 శాతం వడ్డీ రేటు ఇచ్చేవారు. ఇది 4.30 శాతానికి పెరిగింది. అదే సమయంలో 15 నుంచి18 నెలల FD 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇంతకుముందు ఈ ఎఫ్‌డిపై 4.30 శాతం వడ్డీ రేటు ఇచ్చేవారు. దానిని 4.40 శాతానికి పెంచారు.

2 సంవత్సరాల FD నుంచి 18 నెలల FDపై ఇంతకుముందు 4.40 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉండేది. అది ఇప్పుడు 4.50 శాతానికి పెరిగింది. అదే సమయంలో 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై 4.60 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 2 నుంచి 5 కోట్ల రూపాయల FDలపై 4.70 శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories