Hurun Philanthropy List 2024: సామాజిక సేవలో శివ్ నాడార్ మరోసారి టాప్

Hurun Philanthropy List 2024: సామాజిక సేవలో శివ్ నాడార్ మరోసారి టాప్
x
Highlights

Hurun Philanthropy List 2024: మన దేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. సంపాదించడం గొప్ప కాదు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం గొప్ప...

Hurun Philanthropy List 2024: మన దేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. సంపాదించడం గొప్ప కాదు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం గొప్ప అని చెబుతుంటారు పెద్దలు. అయితే వారిలో ఎవరు ఎక్కువగా విరాళం అందించారో ఇప్పుడు చూద్దాం.

కొందరు సంపాదించుకుంటారు.. మరికొందరు సంపాదించిన దానిలో దానధర్మాలు చేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచారు ప్రముఖ పారిశ్రామిక వేత్త హెచ్‌సీఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. ఏడాది కాలంలో ఆయన రూ.2,153 కోట్లను సామాజిక సేవకు కేటాయించారు. ఈ మేరకు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో ఆయన వరుసగా రెండుసార్లు మొదటి స్థానాన్ని సాధించారు.

ఇక ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రెండో స్థానంలో, బజాజ్ కుటుంబం మూడో స్థానంలో నిలిచారు. శివ్ నాడార్ గత ఏడాది రూ.2,042 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ సారి గత ఏడాది కంటే 5 శాతం అధికంగా విరాళాలు అందించారు. రెండో స్థానంలో ఉన్న ముకేష్ అంబానీ రూ.407 కోట్ల విరాళం ఇచ్చారు. గత ఏడాది కంటే 8 శాతం ఎక్కువగా విరాళాలు అందించి తన ఉదారతను చాటుకున్నారు.

మూడో స్థానంలో ఉన్న బజాజ్ కుటుంబం రూ.352 కోట్లు సమాజ సేవకు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 33 శాతం ఎక్కువ. ఇక ఐదో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రూ.330 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే 16 శాతం అధికంగా విరాళాలు ఇచ్చారు. కృష్ణ చివుకుల రూ.288 కోట్లతో 7వ స్థానంలో, సుస్మిత అండ్ సుబ్రోతో బాగ్చి రూ. 179 కోట్లతో 9వ స్థానంలో నిలిచారు. తాజాగా హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో టాప్ 10లో చోటు సంపాదించారు. హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో టాప్ 10 మంది మొత్తం రూ.4,625 కోట్ల విరాళాలను అందించారని నివేదిక వెల్లడించింది. ఇందులో ఆరుగురు విద్య కోసం పెద్ద మొత్తంలో కేటాయించినట్టు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories