Stock Markets: దేశీ మార్కెట్లు వారం తొలి రోజున భారీ నష్టాలు.

Huge Loss on the first day Of  week In Indian Stock Markets
x

Representational Image

Highlights

Stock Markets: ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్‌ ఆరంభం..

Stock Markets: భారత ఈక్విటీ మార్కెట్లు ఆసాంతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి తొలి సెషన్ ను భారీ నష్టాల్లో ముగించిన మార్కెట్లు రెండో సెషన్ లో అక్కడికక్కడే ముగిశాయి. మూడో సెషన్ కి వచ్చేసరికి యూ-టర్న్ తీసుకుని భారీ లాభాల్లో దూసుకుపోగా..నాలుగో ట్రేడింగ్ సెషన్ లోనూ లాభాలను అందించాయి ఇక వీకెండ్ సెషవ్ లో దేశీ మార్కెట్లు కుప్పకూలాయి.కేంద్ర బడ్జెట్‌ తర్వాత జీవనకాల గరిష్ఠాలను తాకి, ఆ సమీపంలోనే కదలాడుతున్న సెన్సెక్స్ గత పది నెలల్లోనే ఒకరోజు అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారం తొలి రోజున భారీ నష్టాల్లో ముగిశాయి.. ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్న బెంచ్ మార్క్ సూచీలు చివరకు భారీ నష్టాలను మిగిల్చాయి ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1145 పాయింట్ల మేర కోల్పోయి 50 వేల దిగువకు చేరగా అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 14, 700 దిగువన స్థిరపడింది..ఇక రెండో సెషన్ లో దేశీ మార్కెట్లు స్వల్ప లాభాల్లో అక్కడికక్కడే ముగిశాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో యూ-టర్న్ తీసుకుని లాభాల బాట పట్టిన సూచీలు చివరకు ఫ్లాట్ గా క్లోజయ్యాయి. సెన్సెక్స్ 7 పాయింట్ల మేర స్వల్ప లాభంతో 49,751 వద్దకు చేరగా...నిఫ్టీ 32 పాయింట్లు ఎగబాకి 14,707 వద్ద స్థిరపడ్డాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మూడో సెషన్ ను భారీ లాబాల్లో ముగించాయి..గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభాన్ని నమోదు చేయగా నిఫ్టీ 15 వేల పాయింట్ల వద్దకు చేరింది.. జాతీయ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీలో తలెత్తిన సాంకేతిక లోపం ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాల్సి వచ్చింది ఇక నాలుగో సె,న్ కి వచ్చేసరికి దేశీ మార్కెట్లు మరోమారు లాభాల్లో ముగిశాయి.. సెన్సెక్స్ 257 పాయింట్లు జంప్ చేసి 51,039 వద్దకు చేరగా నిఫ్టీ 115 పాయింట్లు ఎగబాకి 15,097 వద్ద స్థిరపడ్డాయి.

దేశీ స్టాక్‌ మార్కెట్లు మూడో సెషన్ లో భారీ లాబాలు..

వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనంతో బీఎస్‌ఈలో మదుపర్ల సంపద 5.3 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరై పోయింది. అమెరికాలో బాండ్ల రాబడులు ఒక్కసారిగా పెరగడంతో విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే ఆందోళనలు, అమెరికా- సిరియాల మధ్య ఉద్రిక్తతల దరిమిలా గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీ మార్కెట్ ను నష్టాల బాటన నడిపించాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి నేపధ్యంలో మదుపర్లు ముందు జాగ్రత్తతో అమ్మకాలకు దిగడం కీలకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories