CIBIL Score: మీ సిబిల్‌ స్కోర్‌ ఎంతుందో తెలుసా? ఫ్రీగా ఇలా తెలుసుకోండి..

CIBIL Score
x

CIBIL Score: మీ సిబిల్‌ స్కోర్‌ ఎంతుందో తెలుసా? ఫ్రీగా ఇలా తెలుసుకోండి..

Highlights

CIBIL Score: ఒకప్పుడు సిబిల్ స్కోర్‌ (CIBIL Score) అంటే కేవలం కొందరికి మాత్రమే అవగాహన ఉండేది. కానీ ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score)పై అవగాహన పెరుగుతోంది.

CIBIL Score: ఒకప్పుడు సిబిల్ స్కోర్‌ (CIBIL Score) అంటే కేవలం కొందరికి మాత్రమే అవగాహన ఉండేది. కానీ ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score)పై అవగాహన పెరుగుతోంది. బ్యాంకులు సులభంగా రుణాలు అందిస్తుండడం, బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సిబిల్‌ స్కోర్‌(How to check Cibil Score) ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటున్నారు. ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా. సొంతంగా సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score) ను తెలుసుకునే అవకాశం కూడా కల్పించారు.

సాధారణంగా సిబిల్‌ స్కోరు (CIBIL Score) ను 300 నుంచి 900 వరకు లెక్కిస్తారు. మీ చెల్లింపులు, మీరు తీసుకున్న రుణాలు. రీపేమెంట్ ఆధారంగా ఈ సిబిల్‌ స్కోర్‌ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు 700 క్రెడిట్‌ స్కోర్‌ను బెస్ట్‌ స్కోర్‌గా పరిగణిస్తారు. 700పైన ఉంటేనే రుణాలను అందిస్తారు. అయితే ఉచితంగా సిబిల్ స్కోర్‌ తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఉచితంగా సిబిల్‌ స్కోర్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

* ఇందుకోసం ముందుగా సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cibil.com/లోకి వెళ్లాలి.

* ఆ తర్వాత పర్సనల్‌ సిబిల్ స్కోర్‌ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

* అనంతరం 'గెట్ యువర్‌ ఫ్రీ సిబిల్‌ స్కోర్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే ఈ మెయిల్ ఐడీ ద్వారా అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవాలి. తర్వాత మీ పేరు ఎంటర్‌ చేయాలి.

* తర్వాత పాన్‌, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ఐడీ, రేషన్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి వాటిలో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి.

* ఇక మీ పుట్టిన తేదీ, పిన్ కోడ్‌లతో పాటు రాష్ట్రాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి.

* ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి, కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* రిజిస్టర్డ్‌ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసి కంటిన్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ అకౌంట్‌ను మీరు వినియోగిస్తున్న సిస్టమ్‌తో యాడ్ చేయాలని అనుకుంటున్నారా? అని అడుగుతుంది. ఇలా రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుంది.

* చివరిగా గో టు డ్యాష్‌ బోర్డ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ సిబిల్‌ స్కోర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories