Gold Rates: బంగారం ధరను ఎలా నిర్ణయిస్తారు?

How are Gold Rates Determined
x

Gold Rates: బంగారం ధరను ఎలా నిర్ణయిస్తారు?

Highlights

బంగారం ధర నిర్ణయానికి సింపుల్ ఫార్మూలాను అనుసరిస్తారు. బంగారం వంటి ఇతర విలువైన లోహాలను తూకం వేయడాన్ని ట్రాయ్ ఔన్సుగా పిలుస్తారు.

బంగారం అంటే భారతీయ మహిళలకు మక్కువ ఎక్కువ. ఫంక్షన్లు, పండుగలు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే పసిడి కొనుగోలు చేస్తారు. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నా కొనుగోలుకు భారతీయులు వెనుకాడరు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. బంగారం ధరలను ఎంసిఎక్స్ నిర్ణయిస్తుంది.

ఎంసిఎక్స్ అంటే ఏంటి?

ఎంసిఎక్స్ అంటే మల్టి కమోడిటి ఎక్చేంజ్ . దీన్ని 2003 లో భారతదేశంలో ఏర్పాటు చేశారు. సరుకుల ట్రేడింగ్ ను ఎంసిఎక్స్ లో నిర్వహిస్తారు. ప్రధానంగా బంగారం, వెండి, ప్లాటినం వంటి వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్ ను ఇక్కడ చేసుకోవచ్చు. సెబీ రెగ్యులేటరీ కింద ఇది పనిచేస్తుంది. సెబీ పరిధిలో ట్రేడింగ్ కోసం ఎలా ప్రత్యేక బ్యాంకు ‌ఖాతాలను తెరవాలి. అదే పద్దతిలో ఎంసిఎక్స్ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయాలి.


గోల్డ్ ధరను ఎలా నిర్ణయిస్తారు?

బంగారం ధర నిర్ణయానికి సింపుల్ ఫార్మూలాను అనుసరిస్తారు. బంగారం వంటి ఇతర విలువైన లోహాలను తూకం వేయడాన్ని ట్రాయ్ ఔన్సుగా పిలుస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ 31.1035 గ్రాములు. ఎంసీఎక్స్ ఎక్సేంజ్ లో బంగారం కోసం కోట్ చేసిన యూనిట్ 10 గ్రాములు. సాధారణంగా 10 గ్రాములకు బంగారం ధరను నిర్ణయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర, డాలర్ తో రూపాయి మారకం ధరను గుణిస్తారు. వచ్చిన ఫలితాన్ని 10తో గుణిస్తారు. అప్పుడు వచ్చే ఫలితమే బంగారం ధరగా నిర్ణయిస్తారు. డిమాండ్, సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ లో పరిస్థితుల ఆధారంగా ఈ ధరలుంటాయి.


ప్రతిరోజూ బంగారం ధరల్లో తేడా ఎందుకు?

బంగారానికి దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉన్న సమయంలో బంగారం ధర పెరుగుతుంది. డిమాండ్ తక్కువగా ఉండి సరఫరా ఎక్కువగా ఉన్న సమయంలో ధర తగ్గుతుంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కారణంగానే ప్రతిరోజూ బంగారం ధరల్లో పెరుగుదల లేదా తగ్గుదల కన్పిస్తుంది. అమెరికాలో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినా, పెంచినా వాటి ప్రభావం బంగారంపై ఉంటుంది.

కమోడిటీస్ పరిధిలో కేటగిరిలు

కమోడిటీస్ పరిధిలో ఎనర్జీ, మెటల్ , లైవ్ స్టాక్, వ్యవసాయం వంటి కేటగిరిలున్నాయి.

ఎనర్జీ( క్రూడ్ ఆయిల్, హీటింగ్ ఆయిల్, నాచురల్ గ్యాస్, గ్యాస్ ఆన్ లైన్)

మెటల్స్( బంగారం, వెండి, ప్లాటినం, కాపర్)

లైవ్ స్టాక్, మాంసం(పంది మాంసం, పొట్టెలు, మాంసం)

వ్యవసాయం ( సోయబీన్, గోధుమలు, రైస్, కాఫీ, పత్తి, చక్కెర)

స్టాక్ మార్కెట్లలో సంప్రదాయ పద్దతిలో కమోడిటీలలో ట్రేడింగ్ చేయడం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి, సరుకుల మార్కెట్ ,డిమాండ్లు ,చమురు, అల్యూమినియం, రాగి, చక్కెర, మొక్కజొన్న వంటి ప్రధాన వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories