Home Loan Effect: హోమ్‌లోన్‌ కొనసాగుతున్నప్పుడు పర్సనల్‌ లోన్‌ ఇస్తారా..!

Home Loan is in Effect Will it be Granted if Personal loan is Required Again
x

Home Loan Effect: హోమ్‌లోన్‌ కొనసాగుతున్నప్పుడు పర్సనల్‌ లోన్‌ ఇస్తారా..!

Highlights

Home Loan Effect: హోమ్‌లోన్‌ కొనసాగుతున్నప్పుడు పర్సనల్‌ లోన్‌ ఇస్తారా..!

Home Loan Effect: ఈ రోజుల్లో ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే మార్కెట్‌లో వివిధ అవసరాలకి వివిధ రకాల రుణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇల్లు కొనడానికి గృహ రుణం, కారు-బైక్ కొనడానికి వాహన రుణం, చదువు ఖర్చులకు ఎడ్యుకేషన్ లోన్ అంటూ ఇలా చాలా ఉన్నాయి. అదే విధంగా వ్యక్తిగత ఖర్చుల కోసం కూడా పర్సనల్‌ లోన్‌ ఇస్తారు. అయితే ఒక రుణం కొనసాగేటప్పుడు మరో రుణం మంజూరు చేస్తారా అనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పర్సనల్ లోన్, హోమ్ లోన్

గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే చాలా పత్రాలు అవసరం. మరోవైపు గృహ రుణం చాలా కాలంపాటు తీసుకునే రుణం. గృహ రుణంలో EMI ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం చెల్లించాలి. ఈ పరిస్థితిలో ఎవరైనా గృహ రుణం తీసుకున్నట్లయితే మళ్లీ పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చా.

అయితే హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎవరికైనా పర్సనల్ లోన్ అవసరమైతే అతను పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పర్సనల్ లోన్ పొందడం, పొందకపోవడం అనేది మీరు లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీరు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత పర్సనల్ లోన్ తీసుకుంటే బ్యాంక్ దృష్టిలో మీ రీపేమెంట్ కెపాసిటీ మెరుగ్గా ఉంటే అప్పుడు బ్యాంక్ మీకు పర్సనల్ లోన్ ఇస్తుంది. అయితే మీరు పర్సనల్‌ లోన్‌ తిరిగి చెల్లించలేరని బ్యాంకు భావిస్తే రుణాన్ని మంజూరు చేయదు.

Show Full Article
Print Article
Next Story
More Stories