Gold: బంగారం కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు

Gold: బంగారం కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు
x
Highlights

Gold: తక్కువ ధరకే బంగారం అంటూ ఆఫర్ అందిస్తున్నట్లు చెప్పే ఆన్ లైన్ ప్రకటనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు నకిలీ బంగారాన్ని కొనుగోలు చేసే...

Gold: తక్కువ ధరకే బంగారం అంటూ ఆఫర్ అందిస్తున్నట్లు చెప్పే ఆన్ లైన్ ప్రకటనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు నకిలీ బంగారాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.

బంగారం అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే బంగారం ఒక విలువైన లోహం. ముఖ్యంగా మహిళలకు బంగారంపై ఆసక్తి ఎక్కువగ ఉంటుంది. బంగారం అనేది చాలా మంది అలంకరణ కోసమే కాదు..ఇంట్లో బంగారం ఉంటే శుభప్రదంగా భావించేవారు కూడా ఉంటారు. పెళ్లిళ్లు, వేడుకలకు తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారు. ఇంత ముఖ్యమైన సంపదను కొనేగోళు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది 24క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లలో బంగారాన్ని కొంటుంటారు. అయితే మనం బంగారం కొనే ముందు ఈ నగలు నిజమేనా లేదా నకిలీనా అనేది చాలా మందిలో ప్రశ్న తలెత్తుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గందరగోళం లేకుండా బంగారు ఆభరనాలు కొనుగోలు చేసేందుకు హాల్ మార్క్ ను తప్పనిసరి చేసింది. బంగారం ప్రమాణం ఆధారంగా ఇది సిఫార్సు చేస్తారు. కాబట్టి హాల్ మార్క్ చూసే బంగారాన్ని కొనుగోలు చేయాలి.

ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు BIS హాల్ మార్క్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను సూచిస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థను రూపొందించింది.

అయితే మీరు కొనుగోలు చేసే ఆభరణాలకు BIS హాల్ మార్కింగ్ ఉందా..బంగారు ఆభరణాలపై బంగారం గురించి సమాచారం కూడా రాసి ఉండే విధంగా చూసుకోవాలి. నగలపై 22 క్యారెట్లు, 18క్యారెట్ల అని ఉంటుంది. తప్పనిసరిగా ఆ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అప్పుడే మనం నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు.

హాల్ మార్క్ చేసిన బంగారు నగలకు ప్రత్యేకమైన హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఇది ఆభరణాల వ్యాపారికి మారుతుంటుంది. బంగారాన్ని గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయం తప్పుకుండా తెలుసుకోవాలి. ఇలా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు ఈ అంశాలను తప్పకుండా పరిగణలోనికి తీసుకోవాలి.

అయితే పేరున్న జ్యూవెల్లరీ షాపుల్లోనే బంగారం కొనుగోలు చేయడం మంచిది. ఆఫర్స్ అందిస్తున్న బంగారాన్ని లేదా ఆన్ లైన్ ప్రకటన వల్ల జాగ్రత్తగా ఉండండి. ఫేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్లును తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories