ఆధార్‌కార్డు అప్‌డేట్‌ చేశారా.. యుఐడిఎఐ కొత్త నిబంధనలు జారీ..!

Have you Updated Aadhaar Card UIDAI has Issued New Regulations
x

ఆధార్‌కార్డు అప్‌డేట్‌ చేశారా.. యుఐడిఎఐ కొత్త నిబంధనలు జారీ..!

Highlights

Aadhaar Card: ఆధార్ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

Aadhaar Card: ఆధార్ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఆధార్ నిబంధనలలో కొన్ని సవరణలు చేశారు. ఈ సవరణకు ఆధార్ నిబంధనలు, 2022 అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. కొత్త రూల్ ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం తప్పనిసరి. గుర్తింపు రుజువు, చిరునామా రుజువును అప్‌డేట్ చేయాలి.

సవరణ ప్రకారం ఆధార్ నంబర్ కోసం ఎన్‌రోల్‌మెంట్ చేసిన రోజు నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును అప్‌డేట్‌ చేయాలి. దీనికి సంబంధించి ఆధార్ ఏజెన్సీ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) 10 సంవత్సరాల క్రితం తయారు చేసిన ఆధార్ కార్డును ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోని వారు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలిని సూచించింది.

మీరు ఆధార్‌ను ఎందుకు అప్‌డేట్ చేయాలి..?

కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి ఆధార్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం యూఐడీఏఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో 135 కోట్ల మందికి ఆధార్ కార్డులు తయారు చేశారు. ప్రభుత్వం 2010లో ఆధార్ కార్డులను తయారు చేయడం ప్రారంభించింది. 12 ఏళ్లలో చాలా మంది వ్యక్తులు మారిన కారణంగా పాత చిరునామాలు చెల్లుబాటు కావు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారి పాత అడ్రస్‌లు చెల్లకుండా పోయాయి. ఆధార్ అప్‌డేట్ కాకపోతే సర్వీస్ డెలివరీ ఆగిపోతుంది.

UIDAI ప్రకారం గత 10 సంవత్సరాలలో ఆధార్ బలమైన గుర్తింపు రుజువుగా తయారైంది. దీనిని నేడు అనేక ముఖ్యమైన పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఆధార్ సహాయంతో అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్ సేవలో దీని పాత్ర చాలా ముఖ్యమైనది. పథకాలు, నిరంతరాయ సేవల కోసం ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలి. లేదంటే అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories