LIC Investment: ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేశారా.. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Have you invested in LIC you will be shocked to know where your money is going
x

LIC Investment: ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేశారా.. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

LIC Investment: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇందులో లక్షమంది ఉద్యోగులు, 13 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు.

LIC Investment: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇందులో లక్షమంది ఉద్యోగులు, 13 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఎల్ఐసీ తన పాలసీల ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంటోంది. ఎంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. పేద, మధ్యతరగతి నుంచి ధనవంతుల వరకు పాలసీలను రూపొందిస్తుంది. అందుకే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రజల్లో ఒక నమ్మకమైన గుర్తింపును సాధించింది. అయితే కస్టమర్లు ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బులను సంస్థ ఏం చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

కంపెనీ మొత్తం పెట్టుబడిలో 67 శాతం బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఈక్విటీ షేర్లలో దాదాపు రూ.4.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ.లక్ష కోట్లు వివిధ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేశారు. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్, సబ్సిడరీలు, ఇతర డెట్ సెక్యూరిటీల లో ఇన్వెస్ట్ చేస్తారు. కంపెనీ కొన్నిసార్లు ఈ డబ్బును కంపెనీలో వాటాను కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగిస్తుంది. ఎల్‌ఐసీ పాలసీల గురించి మాట్లాడితే ఎల్‌ఐసీ ఎండోమెంట్, టర్మ్ ఇన్సూరెన్స్, చిల్డ్రన్, పెన్షన్, మైక్రో ఇన్సూరెన్స్ కింద దాదాపు రూ.28-29 కోట్ల విలువైన పాలసీలు మార్కెట్‌లో ఉన్నాయి.

డిసెంబర్ 31, 2023 నాటికి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్ వాటా 58.9%, ఇది ఏడాది క్రితం 65.4%గా ఉండేది. ఎల్‌ఐసీ కస్టమర్లకు పరోక్షంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండెక్స్ ప్లస్ యూనిట్ లింక్డ్ ప్లాన్ అనేది సాధారణ ప్రీమియం ఆధారంగా వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ ప్లాన్ అమలులో ఉన్నంత కాలం, పెట్టుబడిదారుడు పొదుపు చేసే అవకాశాన్ని పొందుతాడు. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ అనే ఒకే పెట్టుబడి పథకంలో రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన మీ డబ్బు పరోక్షంగా మార్కెట్‌లోకి వెళ్తుంది. ఇలా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories