Personal Loan: పర్సనల్‌ లోన్‌ అప్లై చేశారా.. లాభనష్టాలు భేరీజు వేయండి..!

Have You Applied For A Personal Loan Learn About The Pros And Cons
x

Personal Loan: పర్సనల్‌ లోన్‌ అప్లై చేశారా.. లాభనష్టాలు భేరీజు వేయండి..!

Highlights

Personal Loan: ఈ రోజుల్లో అత్యవసరంగా డబ్బులు అవసరమైతే అందరూ ఆధారపడేది పర్సనల్‌ లోన్స్‌పైనే.

Personal Loan: ఈ రోజుల్లో అత్యవసరంగా డబ్బులు అవసరమైతే అందరూ ఆధారపడేది పర్సనల్‌ లోన్స్‌పైనే. బ్యాంకులు కూడా వీటిని సులభంగా అందిస్తున్నాయి. పేపర్ వర్క్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటికి ఈ లోన్స్‌ ద్వారా అధికంగా ఆదాయం సమకూరుతుం ది. అయితే ఈ లోన్స్‌ మంజూరుచేయడానికి క్రెడిట్‌ స్కోర్‌ బెస్ట్‌గా ఉండాలి. లేదంటే అధిక వడ్డీ వసూలు చేస్తారు. ఇలాంటి సమయంలో తాకట్టు పెట్టి లోన్‌ తీసుకోవడం ఉత్తమం. ఈ రోజు పర్సనల్‌ లోన్‌ లాభనష్టాల గురించి తెలుసుకుందాం.

పర్సనల్‌ లోన్లకు ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తారు. అయితే మంచి క్రెడిట్ స్కోర్‌ ఉన్నవారికి వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే 12% వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ పొందవచ్చు. ఎక్కువగా ఉంటే వడ్డీ 18 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ అన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి బ్యాంకులు ఈ లోన్ విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. మీరు తిరిగి చెల్లింపు లు సరిగ్గా చేయకపోతే డిఫాల్ట్ అవుతారు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇంకా మీరు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కష్టమవుతుంది.

కొన్ని పర్సనల్‌ లోన్స్‌లో ముందస్తుగా తిరిగి చెల్లించే అవకాశం ఉండదు. కాబట్టి తీసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకొని తీసుకోవాలి. తాత్కాలికంగా డబ్బు అవసరమైతే పర్సనల్‌ లోన్‌ సౌకర్యవంతంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న కొన్ని సందర్భాలలో లోన్‌ మంజూరవుతుంది కానీ అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తుంటే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మీరు గతంలో పర్సనల్ లోన్ తీసుకుని సరిగ్గా చెల్లిస్తే బ్యాంకులు మీకు ప్రాధాన్యం ఇస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories