Pension Scheme: నెలకీ రూ.9250 గ్యారెంటీ పెన్షన్.. వారికి సువర్ణవకాశం..!

Guaranteed pension of Rs.9250 per month and get back full amount after 10 years
x

Pension Scheme: నెలకీ రూ.9250 గ్యారెంటీ పెన్షన్.. వారికి సువర్ణవకాశం..!

Highlights

Pension Scheme: నెలకీ రూ.9250 గ్యారెంటీ పెన్షన్.. వారికి సువర్ణవకాశం..!

Pension Scheme: రిటైర్మెంట్‌ తర్వాత ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రత కావాలి. దీని కోసం చాలా మంది సీనియర్ సిటిజన్లు మంచి రాబడి వచ్చే స్కీం కోసం ఎదురుచూస్తుంటారు. డబ్బు సురక్షితంగా ఉండాలి అధిక ఆదాయం రావాలని కోరుకుంటారు. అలాంటి ఒక పథకమే ప్రధాన మంత్రి వయ వందన యోజన. పథకంలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. మంచి వడ్డీతో ఆదాయం కూడా లభిస్తుంది. ఈ ప్రభుత్వ పథకం కింద 60 ఏళ్ల తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రతి నెలా రూ.18500 గ్యారెంటీ పెన్షన్ పొందవచ్చు. అంతేకాదు 10 సంవత్సరాల తర్వాత మీ మొత్తం డబ్బు తిరిగి చెల్లిస్తారు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి వయ వందన యోజన అంటే ఏమిటి?

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన(PMVVY) సీనియర్ సిటిజన్ల అవసరాలని దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ పథకం ఒక సామాజిక భద్రతా పథకం అంతేకాదు ఒక పెన్షన్ పథకం. దీనిని భారత ప్రభుత్వం ప్రారంభించింది కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తుంది. PMVVY పథకం కింద సీనియర్ సిటిజన్లు ఇతర పథకాల కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు. ఈ పథకంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు నెలవారీ లేదా వార్షిక పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకం కింద గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలుగా నిర్ణయించారు.

మీకు పింఛను ఎంత వస్తుంది?

ప్రధాన మంత్రి వయ వందన యోజన కింద నెలవారీ పెన్షన్ ప్లాన్‌కు 10 సంవత్సరాల పాటు 8 శాతం వడ్డీ లభిస్తుంది. మరోవైపు వార్షిక పెన్షన్‌ను ఎంచుకుంటే 10 సంవత్సరాలకు 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ప్రభుత్వ పథకంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు LIC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి పాలసీదారుడు మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు లేదా ఒక నెల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. పెట్టుబడిని బట్టి నెలకు 1000 నుంచి 9250 రూపాయల వరకు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో 31 మార్చి 2023 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories