Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో రోజుకి రూ.95 పొదుపు చేస్తే రూ.14 లక్షలు మీవే..!

Gram Sumangal Rural Postal Life Insurance If you save Rs 95 per day it is Rs 14 lakh
x

Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో రోజుకి రూ.95 పొదుపు చేస్తే రూ.14 లక్షలు మీవే..!

Highlights

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌(Post Office Schemes) లు చాలా సురక్షితమైనవి...

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌(Post Office Schemes) లు చాలా సురక్షితమైనవి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. అలాగే మంచి రాబడులు పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి ఈ స్కీమ్‌లో రోజు రూ. 95 పొదుపు చేస్తే మెచ్యూరిటీలో మీరు రూ. 14 లక్షల ఫండ్ పొందవచ్చు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పోస్టాఫీసు పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం మాత్రమే.

దీని పేరు 'గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్(Gram Sumangal Rural Postal Life Insurance Scheme)'. ఈ పథకంలో మీరు రోజుకు రూ. 95 ఆదా చేయవచ్చు చివరకి రూ. 14 లక్షల వరకు పొందవచ్చు. ఈ పథకంలో పాలసీదారు మనీ బ్యాక్ ప్రయోజనం కూడా పొందుతాడు. గ్రామ సుమంగల్ యోజనలో పాలసీదారు మెచ్యూరిటీపై బోనస్ కూడా పొందుతారు. ఈ పథకాన్ని 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. గ్రామ సుమంగళ్ యోజన పాలసీ తీసుకోవడానికి వయోపరిమితి 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉంటుంది.

విశేషమేమిటంటే భారతీయ పౌరులు ఎవరైనా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి పాలసీ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే అతను డబ్బు తిరిగి పొందుతాడు. మనీ బ్యాక్ ప్రయోజనం 3 సార్లు అందుబాటులో ఉంటుంది. దీని కింద 15 ఏళ్ల పాలసీలో ఆరేళ్లు, తొమ్మిదేళ్లు, 12 ఏళ్లు పూర్తయితే 20-20 శాతం మనీ బ్యాక్ లభిస్తుంది. మెచ్యూరిటీపై బోనస్‌తో సహా మిగిలిన 40 శాతం డబ్బు కూడా చెల్లిస్తారు.

20 ఏళ్ల పాలసీ తీసుకున్న వారికి 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్ల వ్యవధిలో 20-20 శాతం చొప్పున డబ్బు తిరిగి వస్తుంది. మిగిలిన 40 శాతం డబ్బు బోనస్‌తో పాటు మెచ్యూరిటీపై చెల్లిస్తారు. పాలసీదారు మరణించినప్పుడు నామినీకి బోనస్ అమౌంట్‌తో పాటు హామీ మొత్తం చెల్లిస్తారు. 25 ఏళ్ల వ్యక్తి రూ.7 లక్షల బీమాతో 20 ఏళ్లపాటు ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా రూ.2853 వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు దాదాపు 95 రూపాయలు పొదుపు చేయాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories